Chiranjeevi Upcoming Movies - ఇది మెగా స్పీడ్

Monday,August 23,2021 - 05:37 by Z_CLU

నిన్న మెగా స్టార్ పుట్టిన రోజు పురస్కరించుకొని వరుసగా మూడు అప్ కమింగ్ సినిమాల అప్ డేట్స్ ఇచ్చారు మేకర్స్. దీంతో ఒకదాని వెనుక మరొకటి అన్నట్టుగా వరుస అప్ డేట్స్ మెగా ఫ్యాన్స్ ని ఉక్కిరిబిక్కిరి చేసేశాయి. సహజంగా పుట్టిన రోజు నాడు చేస్తున్న సినిమాతో పాటు అప్ కమింగ్ సినిమా అప్ డేట్ కూడా ఇస్తుంటారు. కానీ నిన్న మెగా స్టార్ మాత్రం వరుస సినిమాలతో తన స్పీడు పెరగనుందని సినిమా అభిమానులకి తెలిపాడు.

‘ఆచార్య’ పోస్టర్ తో మొదలైన మెగా స్టార్ బర్త్ డే హంగామా ఆ తర్వాత చిరు లూసిఫర్ రీమేక్ టైటిల్ ‘గ్యాంగ్ లీడర్’ తో ఊపందుకుంది. ఆ వెంటనే మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరు నటించబోయే ‘భోలా శంకర్’ సినిమా టైటిల్ మోషన్ పోస్టర్ కూడా ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చాయి. ఇక చిరుకి కీర్తి సురేష్ రాఖి కట్టే స్టిల్ తో మరో పోస్టర్ ని రిలీజ్ చేసి ఇది అన్నా చెల్లెలి కథతో తెరకెక్కనున్న సినిమా అని చెప్పేశాడు మెహర్ రమేష్. లాస్ట్ లో చిరు- బాబీ సినిమాకు సంబంధించి ఒక థీమ్ పోస్టర్ వదిలారు మైత్రి నిర్మాతలు. అందులో టైటిల్ గురించి చెప్పలేదు. కానీ ఈ సినిమాతో మరోసారి మెగా స్టార్ మాస్ కి పూనకాలు తెప్పించడం ఖాయమని హింట్ ఇచ్చారు మేకర్స్. మాస్ గెటప్ లో పదవిపై నిల్చున్న పోస్టర్ మాస్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.

ఇలా మెగా ప్రాజెక్ట్స్ తో నిన్నటి నుండి సోషల్ మీడియాలో హంగామా చేసి మెగా స్పీడు ఎలా ఉండనుందో చూపించారు మెగాస్టార్. ప్రస్తుతం ‘గాడ్ ఫాదర్’ ని సెట్స్ పై పెట్టేసిన చిరు త్వరలోనే ‘భోలా శంకర్’,#Chiru154 సినిమాలను స్టార్ట్ చేయనున్నారు. మరి ఈ క్రేజీ ప్రాజెక్ట్స్ తో చిరు మళ్ళీ తన సత్తా చూపిస్తూ రికార్డులు బద్దలు కొట్టడం ఖయమనిపిస్తుంది.

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics