మెగా బౌండరీలో మెగా ప్రొడ్యూసర్స్

Friday,October 11,2019 - 10:02 by Z_CLU

యంగ్ మెగా ప్రొడ్యూసర్స్ లో ఇంకో అంకె చేరింది. నిన్నా, మొన్నటి వరకు రామ్ చరణ్, వరుణ్ తేజ్ మాత్రమే సినిమా నిర్మాణ బాధ్యతలు తీసుకున్నారు. ఇప్పుడు ఈ వరసలో అల్లు బాబీ కూడా చేరాడు. అయితే ఈసారి కూడా సినిమా మెగా బౌండరీ దాటలేదు.

మెగాస్టార్ 150 వ సినిమాతో నిర్మాతగా మారాడు రామ్ చరణ్. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ స్థాపించి చిరు కమ్ బ్యాక్ సినిమాని భుజాన వేసుకున్నాడు. అయితే ఈ ఒక్క సినిమాతో ఆగలేదు చెర్రీ… ‘సైరా’ సినిమాని నిర్మించి ఇప్పుడు కొరటాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో ఒక నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. తన బ్యానర్ లో ఇది మూడో సినిమా… అయినా ఇప్పటి వరకు బయట హీరోతో సినిమా చేయలేదు.

వరుణ్ తేజ్ కూడా నిర్మించింది ఒక్క సినిమానే. నిహారిక లీడ్ రోల్ గా తెరకెక్కిన ‘సూర్యకాంతం’ తో ప్రొడ్యూసర్ అనిపించుకున్నాడు. ఆ తరవాత మళ్ళీ ఇంకో సినిమా అనౌన్స్ చేయలేదు. చేసిన ఆ ఒక్క సినిమా కూడా మెగా డాటర్ తోనే.

ఇప్పుడు అల్లు బాబీ కూడా అదే చేశాడు. తలుచుకుంటే ఇంకే స్టార్ హీరోనైనా ఎంచుకోవచ్చు. కానీ ఏరికోరి ప్రొడ్యూసర్ గా తన డెబ్యూ సినిమా హీరోని మెగా బౌండరీ నుండే ఎంచుకున్నాడు. అస్సలు బయటికి రాలేదు. చూడాలి మరీ భవిష్యత్ సినిమాలకైనా వేరే స్టార్ హీరోలతో సినిమాలు చేస్తాడా…? లేకపోతే మిగతా మెగా ప్రొడ్యూసర్స్ లా జస్ట్ మెగా కాంపౌండ్ కే పరిమితమవుతాడా..?