మెగా మూవీ ఆఫ్ ది వీక్....

Wednesday,September 07,2016 - 04:00 by Z_CLU

 

ప్రతి వారం ఓ మెగా మూవీని సగర్వంగా సమర్పిస్తోంది మీ జీ సినిమాలు. ఛానెల్ లాంఛ్ అయిన కొద్ది రోజుల్లోనే అపూర్వ స్పందన అందుకున్న జీ సినిమాలు 24 గంటల మూవీ ఛానెల్ లో ఇకపై… మెగా మూవీ ఆఫ్ ది వీక్ కనువిందు చేయబోతోంది. ప్రతి శనివారం రాత్రి 8 గంటలకు ఓ సూపర్ సెన్సేషనల్ మూవీని మీకు సమర్పించనుంది. ఇందులో భాగంగా ఈ శనివారం (సెప్టెంబర్ 10, రాత్రి 8 గం.) మెగా మూవీ బ్రూస్ లీ ని జీ సినిమాలు ఛానెల్ లో ఎక్స్ క్లూజివ్ గా చూసి ఆనందించండి.

Bruce-Lee-2-Movie-Story

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, మెగాస్టార్ చిరంజీవి కలిసి నటించిన ఈ సినిమాకు శ్రీనువైట్ల దర్శకత్వం వహించారు. తమన్ అందించిన ఈ సినిమాలోని పాటలన్నీ సూపర్ హిట్. ఇక సినిమా చివరిలో మెగా స్టార్ ఎంట్రీ తో కూడిన ఫైట్ ఈ స్పెషల్ అట్రాక్షన్. సినీ పరిశ్రమలో ఓ ఫైటర్ కుటుంబ కధాంశం తో తెరకెక్కిన ‘బ్రూస్ లీ’ బ్లాక్ బస్టర్ చిత్రం గా జీ సినిమాలు ఛానెల్ లో అలరించనుంది.