మెగా మహా శివరాత్రి

Wednesday,February 22,2017 - 01:34 by Z_CLU

ఈ శివరాత్రి మెగా అకేషన్ లా ట్రాన్స్ ఫాం కానుంది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న DJ టీజర్ శివరాత్రి రోజు సోషల్ మీడియాలో మ్యాగ్జిమం స్పేస్ ని ఆక్యుపై చేయబోతుంది. ఇక సిల్వర్ స్క్రీన్ పై సాయి ధరం తేజ్ విన్నర్ కూడా అదే రోజు నుండి హంగామా చేయనుంది.

ఫేవరేట్ స్టార్స్ సినిమాకి సంబంధించి ఏ చిన్న అప్ డేట్ బయటికి వచ్చినా, ట్రెండింగ్ క్యాటగిరీ కి రీచ్ చేయనిదే నిద్ర పోని ఫ్యాన్స్ DJ టీజర్ కోసం ఇప్పటి నుండే జాగారం మొదలుపెట్టేశారు. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్ తో బన్ని ఫ్యాన్స్ కి డిఫెరెంట్ సినిమా గ్యారంటీ అని హింట్స్ ఇచ్చినా, టీజర్ తో సినిమాని ఫ్యాన్స్ కి మరింతగా రీచ్ అయ్యే ఆలోచనలో ఉన్నాడు స్టైలిష్ స్టార్.

ఇక సాయి ధరం తేజ్, రకుల్ ప్రీత్ సింగ్.. ఇద్దరూ బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ సూపర్ ఫాం లో ఉన్నారు. దానికి తోడు హార్స్ రైడింగ్ మెయిన్ ఎలిమెంట్ గా లావిష్ గా తెరకెక్కిన ఈ సినిమా, న్యాచురల్ గానే బోలెడంత ఎక్స్ పెక్టేషన్స్ ని బ్యాగ్ లో వేసుకుంది. ఏముంది… అల్టిమేట్ గా చెప్పాలంటే అటు DJ టీజర్ రివ్యూస్ తో, ఇటు విన్నర్ సినిమాపై రెస్పాన్స్ మొత్తానికి సోషల్ మీడియాలోను, ఇటు సినీ టౌన్ జంక్షన్ జామ్ కావడం గ్యారంటీ.