రీమేక్ పై కన్నేసిన మెగా హీరోయిన్?

Thursday,August 11,2016 - 05:32 by Z_CLU

‘ఒక మనసు’ చిత్రం తో కథానాయికగా ఎంట్రీ ఇచ్చిన మెగా హీరోయిన్ నిహారిక ఓ రీమేక్ పై కన్నేసిందనే వార్త ఫిలిం నగర లో చక్కర్లు కొడుతుంది. మొన్నటి వరకూ యాంకర్ గా అలరించిన ఈ ముద్దుగుమ్మ కథానాయికగా కనిపించాలని తెగ ఉవ్విల్లూరిన విషయం తెలిసిందే. అయితే మొదటి చిత్రం అమ్మడు కి అంతగా గుర్తింపు తీసుకురాలేదని చెప్పుకోవాలి. మెగా ఫామిలీ నుండి కథానాయికగా రావడం అభిమానులు నిహారిక ను గ్లామర్ పాత్రలో చూడలేకపోవడం ఈ మెగా హీరోయిన్ కు కాస్త మైనస్ అనే చెప్పుకోవాలి. అందుకే రెండో సినిమాకు ఆచి తూచి జాగ్రత్త వహిస్తుందట ఈ భామ. ప్రస్తుతం నిహారిక పంజాబీ లో ఓ థ్రిల్లర్ చిత్రాన్ని తెలుగు లో రీమేక్ చెయ్యడానికి సన్నాహాలు చేస్తుందట. ఈ సినిమాలో పెళ్లి చూపులు కథానాయకుడు విజయ్ దేవరకొండ తో కలిసి నటించనుందని వినికిడి. మరి ఈ వార్తలో నిజం ఎంతో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.