ప్రతి ఒక్కరు రెండేసి సినిమాలు

Friday,October 14,2016 - 10:30 by Z_CLU

మెగా ఫ్యామిలీ లో యంగ్ హీరోలు ప్లానింగ్ తో దూసుకుపోతున్నారు. బన్నీ, రామ్ చరణ్ రెండేసి సినిమాలతో బిజీ అవుతుంటే, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, శిరీష్ లు కూడా  వరుస సినిమాలతో కాస్త స్పీడ్ పెంచేశారు.

varun-tej-interview

‘ముకుంద’ సినిమాతో కథానాయకుడిగా ఎంట్రీ ఇచ్చిన నాగబాబు తనయుడు వరుణ తేజ్ ‘కంచె’ తో హీరో గా గుర్తింపు సంపాదించుకున్నాడు. ‘కంచె’ విజయం ఇచ్చిన ఉత్సాహం తో హీరో గా స్పీడ్ పెంచేశాడు. ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీ అయిపోయాడు. ఓ పక్క శ్రీను వైట్ల దర్శకత్వంలో ‘మిస్టర్’ సినిమాలో నటిస్తూనే, మరో వైపు డైరెక్టర్ శేఖర్ కమ్ములతో ‘ఫిదా’ అనే సినిమా చేస్తున్నాడు.

sai-dharam-tej-latest-stills-in-rey-11

మరో మెగా హీరో  సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీ అయిపోయాడు. ఓ వైపు గోపీచంద్ మలినేని తో సినిమా చేస్తున్న తేజూ… మరో వైపు క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ‘నక్షత్రం’ లో సందీప్ కిషన్ తో పాటు మరో ముఖ్య పాత్ర లో నటిస్తున్నాడు. ఈ రెండు సినిమాలతో పాటు తనకి హీరో గా గుర్తింపు తెచ్చిన ఏ.ఎస్.రవి కుమార్ చౌదరి దర్శకత్వం లో మరో సినిమా చెయ్యడానికి సిద్దమవుతున్నాడు.

dc-cover-20160128000134

‘శ్రీరస్తు శుభమస్తు’ సినిమాతో కమర్షియల్ హిట్ అందుకున్న అల్లు శిరీష్ కూడా రెండు సినిమాలకు సై అంటున్నాడు. డైరెక్టర్ ‘వి.ఐ.ఆనంద్’ తో ఓ సైన్స్ ఫిక్షన్ సినిమా చేయడానికి రెడీ అవుతున్న శిరీష్… సైమల్టేనియస్ గా మరో సినిమా కూడా చేసేందుకు డైరక్టర్ వేటలో పడ్డాడు.