సరికొత్త దారుల్లో మెగాహీరోలు

Wednesday,June 28,2017 - 07:10 by Z_CLU

మెగా అంటే మాస్… కమర్షియల్ సినిమాలు గుర్తొస్తాయి. కానీ ఇప్పుడా కాంపౌండ్ లో జస్ట్ మాస్ సినిమాలే కాదు సరికొత్తగా ప్రయోగాలు జరుగుతున్నాయి. సినిమా సినిమాకి డిఫరెన్స్ మెయిన్ టైన్ చేయాలనే స్ట్రాంగ్ రూల్ పెట్టుకున్న మెగా హీరోస్ ఇంటరెస్టింగ్ ప్రయోగాత్మక సినిమాలతో ఎంటర్ టైన్ చేయబోతున్నారు.

ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కనున్న సినిమాలో ఫ్రీడమ్ ఫైటర్ లా కనిపించబోతున్నాడు మెగాస్టార్. తన కెరీర్ లో ఇప్పటివరకు స్వాతంత్ర్య సమరయోధుడిగా కనిపించలేదు చిరు. ఇన్నాళ్లకు రీఎంట్రీతో చిరు కోరిక తీరబోతోంది. గెటప్ నుంచి డైలాగ్ డెలివరీ వరకు ప్రతిది కొత్తగా ఉండబోతోంది ఈ సినిమాలో.

చెర్రీ సినిమా అంటేనే గ్రేస్ ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ మైండ్ లో ఫిక్సయిపోతుంది. అలాంటిది సుకుమార్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న రంగస్థలంలో వినికిడి లోపం ఉన్న వ్యక్తిగా నటిస్తున్నాడట రామ్ చరణ్. 1985 బ్యాక్ డ్రాప్ స్టోరీతో తెరకెక్కుతున్న ఈ సినిమా చెర్రీ కరియర్ లో మెగా ఎక్స్ పెరిమెంటల్ మూవీగా నిలిచిపోనుంది.

 

వక్కంతం వంశీ డైరెక్షన్ లో తెరకెక్కనున్న ‘నా పేరు సూర్య’ అనే సినిమాలో అల్లు అర్జున్ బోర్డర్ లో సైనికుడిలా కనిపిస్తాడనే టాక్ నడుస్తోంది. సరైనోడు సినిమాలో కూడా మిలట్రీ మేన్ గా కనిపిస్తాడు బన్నీ. కాకపోతే కొత్త సినిమా విషయాానికొచ్చేసరికి బోర్డర్ లో సిసలైన సైనికుడిగా కనిపిస్తాడట. ఈ మేరకు జమ్ముకశ్మీర్ లో ఓ షెడ్యూల్ కూడా ప్లాన్ చేస్తున్నారు.

 వరుణ్ తేజ్ కరియర్ మొత్తం ప్రయోగాలే. తనకంటూ పర్టికులర్ గా ఏ ఇమేజ్ లేకుండా ఉండటమే ఇమేజ్ అని బిలీవ్ చేసే వరుణ్ తేజ్ ఈ సారి కమ్ముల డైరెక్షన్ లో ఫుల్ ఫ్లెజ్డ్ లవ్ స్టోరీలో నటిస్తున్నాడు. లవర్ బాయ్ గా నటించడం వరుణ్ తేజ్ కు కొత్త కాదు. కాకపోతే కమ్ముల సినిమాలో హీరో అంటే ఎలా ఉంటాడో అందరికీ తెలిసిందే. అసలు హీరో అనడం కూడా కరెక్ట్ కాదేమో. అంత నేచురల్ గా ఉంటాడు. అందుకే ఫిదాతో వరుణ్ తేజ్ ఓ సరికొత్త మార్గంలో అడుగుపెడుతున్నాడేమో అనిపిస్తోంది.

ఒక్కో సినిమాతో టాలీవుడ్ లో తనకంటూ స్పెషల్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకునే ప్రాసెస్ లో ఉన్న అల్లు శిరీష్ కూడా కంటెంట్ కొత్తగా ఉంటేనే సంతకం చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ మెగా హీరో, డైరెక్టర్ V.I. ఆనంద్ సైన్స్ ఫిక్షన్ సినిమాలో నటిస్తున్నాడు. లుక్ నుంచి మేనరిజమ్స్ వరకు అన్ని యాంగిల్స్ లో కొత్తగా కనిపిస్తాడట శిరీష్.

ఇలా మెగా హీరోలంతా డిపరెంట్ సబ్జెక్ట్స్ తో, డిఫరెంట్ మేకోవర్స్ ట్రైచేస్తున్నారు. కాంపౌండ్ లో ఒక్క సాయిధరమ్ తేజ్ మాత్రం ఫుల్ లెంగ్త్ మాస్ మసాలా సినిమాలు చేస్తున్నాడు.