మెగా హీరోలు ...ఫుల్ బిజీ !

Monday,February 24,2020 - 12:44 by Z_CLU

మెగాస్టార్ నుండి మెగా అల్లుడు వరకూ మెగా కాంపౌండ్ హీరోలందరూ ఫుల్ బిజీగా సినిమాలు చేస్తూ ఫ్యాన్స్ లో ఫుల్ జోష్ నింపుతున్నారు. అయితే ఈ ఇయర్ మెగా బ్రదర్స్ ఇద్దరూ ఒకే సారి షూటింగ్ లో ఉండటం ఫ్యాన్స్ కి మరింత సంతోషాన్ని కలిగిస్తుంది. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్ లో నటిస్తున్న సినిమా షూటింగ్ పాల్గొంటున్నాడు. రామోజీ ఫిలిం సిటీలో ప్రస్తుతం చిరుపై కొన్ని కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు.

ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎవరూ ఊహించని విధంగా ఏకంగా రెండు సినిమాలను ఒకే సారి సెట్స్ పై పెట్టి జెట్ స్పీడ్ లో షెడ్యుల్స్ ఫినిష్ చేసే పనిలో ఉన్నాడు.

రామ్ చరణ్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న’ఆర్ఆర్ఆర్’ షూటింగ్ లో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. మరో 3 నెలల పాటు ఇదే షూటింగ్ లో ఉంటాడు చరణ్. ఇటివలే ‘అల వైకుంఠపురములో’ తో ఇండస్ట్రీ హిట్ కొట్టిన బన్నీ కూడా సుకుమార్ సినిమాను వచ్చే వారం నుండి మొదలు పెట్టబోతున్నాడు. కేరళలో భారీ షెడ్యుల్ ప్లాన్ చేస్తోంది యూనిట్. ఈ సినిమా కోసం కొత్త లుక్ ట్రై చేస్తున్నాడు.

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కూడా తన 10వ సినిమాను సెట్స్ పైకి తీసుకొచ్చాడు. ఇవాళ్టి నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూట్ మొదలైంది. సాయి ధరం తేజ్ కూడా సోలో బ్రతుకే సో బెటర్ సినిమా షూటింగ్ లో బిజీ గా ఉన్నాడు. ‘ప్రతి రోజు పండగే’ ఇచ్చిన సక్సెస్ జోష్ తో మునుముందు ఇంకా స్పీడ్ పెంచనున్నాడు.

మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ కూడా తన మొదటి సినిమా  ‘ఉప్పెన’ సినిమాకి ఫినిషింగ్ టచ్ ఇచ్చే పనిలో ఉన్నాడు. మరో వైపు మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ కూడా ‘సూపర్ మచ్చి’ తో సెట్స్ పై ఉన్నాడు.  అల్లు శిరీష్ త్వరలోనే తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఇలా మెగా హీరోలందరూ తమ సినిమాలతో  సెట్స్ పై ఉంటూ ఫ్యాన్స్ కి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందిస్తూ సరికొత్త జోష్ తో దూసుకుపోతున్నారు.