నితిన్ కథతో మెగాహీరో మూవీ

Tuesday,September 20,2016 - 07:10 by Z_CLU

ఒకరితో సినిమా అనుకుంటే మరో హీరో లైన్లోకి రావడం ఈమధ్య ఎక్కువగా చూస్తున్నాం. ఆమధ్య హీరో అఖిల్ విషయంలో ఇలానే జరిగింది. హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నట్టు అఖిల్ ప్రకటించిన కొన్ని రోజులకే… ఆ దర్శకుడితో నితిన్ సినిమా స్టార్ట్ చేశాడు. అప్పటికే కుదిరిన ఒప్పందం ప్రకారం అలా చేయాల్సి వచ్చింది. తాజాగా ఇప్పుడు నితిన్ కు సంబంధించిన ఓ స్టోరీ, మెగా కాంపౌండ్ కు చేరింది.

   అ..ఆ సినిమా విడుదలకు ముందే దర్శకుడు కొండా విజయ్ కుమార్ తో ఓ సినిమా చేసేందుకు నితిన్ ఒప్పుకున్నాడు. పైగా ఆ సినిమా ‘గుండెజారి గల్లంతయిందే’ మూవీకి సీక్వెల్ కూడా కావడం హైలెట్. అయితే అ..ఆ హిట్ తర్వాత నితిన్ మనసు మార్చుకున్నాడు. కొండాను కాదని, హనుతో సెట్స్ పైకి వెళ్తున్నాడు. దీంతో ఇప్పుడు దర్శకుడు కొండా విజయ్ కుమార్, అదే కథతో మెగా కాంపౌండ్ లోకి అడుగుపెట్టినట్టు వార్తలు వస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం… నితిన్ నటించిన గుండెజారి గల్లంతయిందే సీక్వెల్ లో మెగా హీరో వరుణ్ తేజ హీరోగా నటించే అవకాశాలున్నాయి. అయితే వరుణ్ తేజకు, దర్శకుడు కొండా అప్పటి సీక్వెల్ కథను వినిపించాడా.. లేక ఫ్రెష్ స్టోరీని నెరేట్ చేశాడా అనే విషయంపై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు.