మెగా అల్లుడి దారెటు..?

Monday,February 11,2019 - 04:32 by Z_CLU

ఫస్ట్ సినిమాతోనే సూపర్ హిట్ కొట్టాడా…? తనకంటూ ఒక బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేసుకోగలిగాడా..? లాంటి ప్రశ్నలు పక్కన పెడితే ‘విజేత’ సినిమాతో, కంటెంట్ ఉన్న కుర్రాడు అనిపించుకున్నాడు మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్. ఎంత సింపుల్ గా లాంచ్ అవుదామని ప్రయత్నాలు చేసినా, సినిమా రిలీజ్ టైమ్ వచ్చేసరికి ఆల్మోస్ట్ ఫోకస్ ‘విజేత’ పైనే ఉంది. మెగా కాంపౌండ్ కి ఉన్న వైబ్రేషన్స్ అలాంటివి మరీ.

ఈ మెగా అల్లుడి ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి..? అల్టిమేట్ గా సినిమాలు చేయడమే… అది ఫిక్సనుకోండి కాకపోతే ఎలాంటి సినిమాలు..? రెగ్యులర్ గా ఒకే మూసలో సినిమాలు చేసుకుంటూ పోతానంటే, మనకు ఆల్రెడీ మెగాకాంపౌండ్ నుండే అరడజను మంది హీరోస్ ఉన్నారు. అలాంటప్పుడు కళ్యాణ్ దేవ్ నుండి స్పెషల్ గా ఎక్స్ పెక్ట్ చేయడానికి ఏముంటుంది..?

ఫస్ట్ సినిమాకి కూడా రెగ్యులర్ హీరోల్లా, కోర్ లవ్ స్టోరీ తీసుకోలేదు, అలాగని రిస్కైనా పర్వాలేదనుకుని మాస్ సినిమా ఎంచుకున్నాడా అంటే అదీ లేదు. సింపుల్ గా ఫాదర్ సెంటిమెంట్ తో, ఫ్యామిలీస్ కి కనెక్ట్ అయ్యే ప్రయత్నం చేశాడు. మరి అంత ప్లాన్డ్ గా లాంచ్ అయిన మన మెగా అల్లుడు నెక్స్ట్ సినిమాలో ఏం చేయబోతున్నాడు…?

 ఈ రోజు కళ్యాణ్ దేవ్ బర్త్ డే సందర్భంగా సెకండ్ మూవీ నుండి ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు మేకర్స్. మరింత కలర్ ఫుల్ గా కనిపిస్తున్నాడు కళ్యాణ్ దేవ్ ఈ పోస్టర్ లో. అయితే రేజ్ అవుతున్న ప్రశ్నల్లా, ఈ సినిమా ఏ జోనర్ లో ఉండబోతుంది. మొదటి సినిమా సక్సెస్ తరవాత బ్యాక్ టు బ్యాక్ కథలు విన్నాడు కళ్యాణ్ దేవ్. ఈ సారి కొత్త డైరెక్టర్ పులివాసుకే ప్రయారిటీ ఇవ్వడానికి రీజన్స్ ఏంటి..?

కనీసం గెస్ చేద్దామనుకున్నా టైటిల్ కూడా రివీల్ చేయలేదు మేకర్స్. ప్రస్తుతం సెకండ్ షెడ్యూల్ జరుపుకుంటున్న సినిమా యూనిట్, కరెక్ట్ టైమ్ చూసుకునే తక్కిన డీటేల్స్ అనౌన్స్ చేసే ఆలోచనలో ఉన్నారు. అప్పటివరకు మనం కూడా సస్పెన్స్ మోడ్ లో ఉండాల్సిందే.