మెగా అల్లుడి సినిమాలో మెగా హీరో?

Wednesday,December 25,2019 - 01:02 by Z_CLU

హీరోగా రెండోసారి అదృష్టాన్ని పరీక్షించుకోడానికి రెడీ అవుతున్నాడు కల్యాణ్ దేవ్. తొలి సినిమా విజేత ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోవడంతో.. షార్ట్ గ్యాప్ తర్వాత సూపర్ మచ్చి అనే మరో సినిమాతో తెరపైకొస్తున్నాడు కల్యాణ్ దేవ్.

ఈసారి ఈ సినిమాలో మెగా ఎట్రాక్షన్ ఉండబోతోంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ సినిమాలో మెగా హీరోల్లో ఎవరో ఒకరు ఈ సినిమాలో స్పెషల్ ఎట్రాక్షన్ గా మెరిసే ఛాన్స్ ఉంది. అది చిరంజీవి కావొచ్చు. లేదంటే రామ్ చరణ్, పవన్ కల్యాణ్ లో ఒకరు కావొచ్చు.

రిజ్వాన్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై రిజ్వాన్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు పులి వాసు దర్శకత్వం వహిస్తున్నాడు. ఖుర్షీద్ (ఖుషి) కో-ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నాడు. మ్యూజిక్ సెన్సేషన్ తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. రాజేంద్రప్రసాద్, పోసాని, నరేష్, ప్రగతి లాంటి సీనియర్ ఆర్టిస్టులు ఇందులో నటిస్తున్నారు.