మెగా ఫోకస్...

Sunday,February 05,2017 - 12:07 by Z_CLU

‘ఖైదీ నంబర్ 150’ సినిమాతో రీఎంట్రీ ఇచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న మెగాస్టార్ రీఎంట్రీకి వచ్చిన రెస్పాన్స్ తో వెంటనే నెక్స్ట్ సినిమాపై ఫోకస్ పెట్టేశాడు. రామ్ చరణ్ నిర్మాణం లో తెరకెక్కనున్న 151 సినిమాపై పూర్తి ఫోకస్ పెట్టేశాడు చిరు. ‘ఖైదీ నంబర్ 150’ రిలీజ్ తర్వాత 2-3 నెలలు గ్యాప్ తీసుకుందామనుకున్న చిరు.. ప్రెజెంట్ తన ఒపీనియన్ మార్చుకొని నెక్స్ట్ సినిమాను త్వరలోనే సెట్స్ పైకి తీసుకు రావాలని చూస్తున్నాడు.

ఇప్పటికే ఈ సినిమాలో తన లుక్ పై దృష్టిపెట్టి వర్కవుట్స్ చేస్తున్న మెగాస్టార్… మరోసారి తన లుక్ తో మెస్మరైజ్ చేయడానికి రెడీ అవుతున్నాడట. రీఎంట్రీ ఇచ్చిన ‘ఖైదీ నంబర్ 150’ సినిమాలో చిరు లుక్ కు మంచి రెస్పాన్స్ రావడంతో 151లో తన లుక్ తో మళ్ళీ అదుర్స్ అనిపించుకోవాలని డిసైడ్ అయ్యాడు. సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కనున్న ఈ సినిమా ప్రెజెంట్ కథా చర్చల్లో ఉన్నట్టు సమాచారం. మరి ఈ సినిమాలో మెగా లుక్ ఎలా ఉండబోతుందో.. తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలి…