ఇకపై నెలకో సినిమా

Wednesday,October 26,2016 - 11:52 by Z_CLU

మెగా హీరోలంతా మూకుమ్మడిగా డెసిషన్ తీసుకున్నారు. ఫ్యాన్స్ కు బ్యాక్-టు-బ్యాక్ వినోదాన్ని అందించాలని ఫిక్స్ అయ్యారు. ఇందులో భాగంగా చెరొక నెలను మెగాఫ్యాన్స్ పంచుకున్నారు. రామ్ చరణ్ తో ఈ మెగా ఫెస్టివల్ ప్రారంభం కానుంది. చెర్రీ నటించిన ధృవ సినిమాను డిసెంబర్ లో విడుదల చేయాలని నిర్ణయించారు.

డిసెంబర్ లో చెర్రీ హంగామా పూర్తికాగానే… జనవరి నెలలో చిరంజీవి రెడీ అయిపోతున్నాడు. దాదాపు 8 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత తన రీఎంట్రీ మూవీ, ఖైదీ నంబర్-150తో ఎంటర్ టైన్ చేయబోతున్నాడు. ఇక ఫిబ్రవరిలో సాయిధరమ్ తేజ్, లేదా వరుణ్ తేజ నుంచి ఒక సినిమా రానుంది. ప్రస్తుతం వరుణ్ తేజ.,.. శ్రీనువైట్ల దర్శకత్వంలో మిస్టర్ అనే మూవీ చేస్తున్నాడు. అటు తేజూ కూడా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో… విన్నర్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ రెండింటిలో ఒకటి ఫిబ్రవరిలో విడుదలయ్యే అవకాశం ఉంది.

mega-festival

మార్చి నెలలో పవర్ స్టార్ సందడి చేయబోతున్నాడు. తను నటిస్తున్న కాటమరాయుడు సినిమాను సమ్మర్ ఎట్రాక్షన్ గా మార్చిలో విడుదల చేయాలని పవన్ అనుకుంటున్నాడు. బన్నీ కూడా కాస్త స్పీడ్ పెంచితే… దువ్వాడ జగన్నాధమ్-డీజే సినిమాను ఏప్రిల్ లో విడుదల చేసేయొచ్చు.