#RamarajuForBheem - మెగా ఫ్యాన్స్ కూడా వెయిటింగ్

Wednesday,October 21,2020 - 03:48 by Z_CLU

RRR నుండి రాబోతున్న ఎన్టీఆర్ వెర్షన్ టీజర్ కోసం NTR ఫాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. #RamarajuForBheem పేరుతో రేపు ఉదయం 11 గంటలకు విడుదల కానున్న ఈ టీజర్ కోసం అటు మెగా ఫ్యాన్స్ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

Ramaraju వర్షన్ టీజర్ కి NTR వాయిస్ ఇచ్చి ఆ టీజర్ కి బలం చేకూర్చాడు. ఇప్పుడు Komaram Bheem వర్షన్ టీజర్ కి రామ్ చరణ్ ఇవ్వబోయే మెగా పవర్ ఫుల్ వాయిస్ ఎలా ఉంటుందా..? అని తారక్ ఫ్యాన్స్ తో పాటు మెగా ఫ్యాన్స్ కూడా వెయిట్ చేస్తున్నారు.

రేపు రిలీజ్ కానున్న ఈ టీజర్ కోసం ఐదు భాషల్లో వాయిస్ ఓవర్ ఇచ్చాడు చరణ్. మిగతా భాషలతో పాటు మలయాళం వర్షన్ కి కూడా చరణే స్వయంగా వాయిస్ ఇవ్వడం విశేషం.

మరి మెగా వాయిస్ ఓవర్ తో రానున్న ఎన్టీఆర్ టీజర్ రేపు ఎంతటి సంచలనం నమోదు చేస్తుందో, తారక్ విజువల్స్ కి చెర్రీ ఏ రేంజ్ లో వాయిస్ ఇచ్చాడో చూడాలి.

Also Read – ఎన్టీఆర్, చరణ్ స్వతంత్ర పోరాటం చేస్తారా?