మెగా ఫాన్స్ వెయిటింగ్.....

Tuesday,January 31,2017 - 03:11 by Z_CLU

మెగా ఫాన్స్ ఓ మెగా ఫంక్షన్ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇంతకీ మెగా ఫాన్స్ అందరు వెయిట్ చేస్తున్న ఆ ఫంక్షన్ ఏమిటా? అనుకుంటున్నారా? ఆ మెగా ఈవెంట్ మరేదో కాదు ‘ఖైదీ నంబర్ 150 ‘థాంక్స్ మీట్. మెగా స్టార్ రి ఎంట్రీ ఇచ్చిన ఈ సినిమా సంక్రాంతి బరి లో గ్రాండ్ హిట్ సాధించి 100 కోట్ల షేర్ కి దగ్గరవుతున్న ఈ సినిమా కి సంబంధించి మెగా ఫాన్స్ కి తెలుగు ప్రేక్షకులకి స్పెషల్ థాంక్స్ చెప్పాలనుకున్నాడు చిరు. ఇందుకు ఓ గ్రాండ్ ఈవెంట్ కూడా ప్లాన్ చేశారు.

khaidi-no-150-thanksmeet
ఇక మొన్న మధ్య ఈ మెగా థాంక్స్ మీట్ అతి త్వరలోనే ఉంటుందని ప్రెజెంట్ ఇందుకోసం పనులు జరుగుతున్నాయని ఆ ఈవెంట్ లో నిర్మాతగా రామ్ చరణ్ ఈ సినిమా కలెక్షన్స్ గురించి సాధించిన విజయం గురించి మాట్లాడతాడని చెప్పుకొచ్చాడు అల్లుఅరవింద్. అయితే ఏ మైందో ? ఏమో కానీ జనవరి ఎండింగ్ లో జరగాల్సిన ఈ ఈవెంట్ పోస్ట్ ఫోన్ అయ్యింది. ఇక ఈ ఫంక్షన్ ఎప్పుడెప్పుడా? ఈ వేడుకలో చిరు, చరణ్ ఏం మాట్లాడతారా? అని ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు మెగా ఫాన్స్. మరి ఈ వేడుక కి సంబంధించిన డేట్ ప్లేస్ ను మెగా ఫామిలీ ఎప్పుడు అనౌన్స్ చేస్తుందో? చూడాలి.