మెగా దీపావళి

Monday,October 31,2016 - 05:53 by Z_CLU

స్టార్స్ దీపావళి శుభాకాంక్షలు చెబితే చాలు అభిమానులు పొంగిపోతారు. ఫస్ట్ లుక్ విడుదల చేస్తే పండగ చేసుకుంటారు. అయితే అంతకుమించి ఆనందాన్ని ఇవ్వాలనుకుంది మెగా కాంపౌండ్. ఈ కాంపౌండ్ లో హీరోలు దీపావళిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారనే ఉత్సుకత అందరికీ ఉంటుంది. అందుకే ఫ్యాన్స్ కోసం మెగా కాంపౌండ్ ఓ చిరు ప్రయత్నం చేసింది. దీపావళి సందర్భంగా తీసుకున్న గ్రూప్ ఫొటోను రిలీజ్ చేసింది. ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు… ఫొటో అంతా హీరోలే. కళ్లకు పండగే.మెగా హీరోయిన్ నిహారిక కూడా అందులో ఉంది. ఇంకేముంది… ఫొటో విడుదల అవ్వడమే ఆలస్యం… సోషల్ మీడియాలో ఇది తెగ హంగామా చేస్తోంది. నిజంగా ఈ ఫ్రేమ్ లో పవన్ ఉంటే ఇంకెంత బాగుంటుందో కదా… చాలామంది ఫీలింగ్ ఇదే.

chiru-2