మెగా కాంపౌండ్ లో రూ.300 కోట్లు..

Thursday,October 13,2016 - 12:11 by Z_CLU

అవును… అటుఇటుగా మెగాకాంపౌండ్ లో తేలిన లెక్క ఇది. మెగాహీరోలందరి ఏడాది టర్నోవర్ యావరేజ్ గా 3వందల కోట్ల రూపాయలు. ప్రస్తుతం సౌత్ లోనే కాదు… అటు బాలీవుడ్ లో కూడా ఇంత స్టామినా కలిగిన ఫ్యామిలీ ఇంకోటి లేదు.

chiru-pawan

చిరంజీవి మళ్లీ సినిమాల్లోకి వచ్చారు. తన 150వ సినిమా ఖైదీనంబర్-150ను సెట్స్ పైకి తీసుకొచ్చారు. ఈ సినిమా బడ్జెట్ సంగతి అటుంచితే మార్కెట్ మాత్రం 50కోట్ల రూపాయలకు పైమాటే. అటు పవన్ కూడా సినిమాల సంఖ్య పెంచాడు. వచ్చే ఏడాది కనీసం 2 సినిమాలు విడుదలచేయబోతున్నాడు. పవర్ స్టార్ ఒక్కో సినిమా హిట్ అయితే వంద కోట్లు… ఎబోవ్ యావరేజ్ గా ఆడినా మినిమం 50కోట్లు మార్కెట్ చేస్తుంది.

bunny-cherri

బన్నీ కూడా సరైనోడుతో తన మార్కెట్ పెంచుకున్నాడు. ఏకంగా 70కోట్ల క్లబ్ లోకి చేరిపోయాడు. అటు రామ్ చరణ్ కూడా తన సినిమాలతో ఏడాదికి 40-50కోట్ల మార్కెట్ క్రియేట్ చేస్తున్నాడు.

mega-young-heros

ఇక కాంపౌండ్ లో సాయిధరమ్ తేజ, వరుణ్ తేజ, అల్లు శిరీష్ ఉండనే ఉన్నారు. తాజాగా తిక్క సినిమాతో తన మార్కెట్ ను ప్రస్తుతానికి 20కోట్ల రూపాయలుగా ఫిక్స్ చేసుకున్నాడు తేజు. అటు వరుణ్ తేజ కూడా తన మినిమం గ్యారెంటీ సినిమాలతో 10-15 కోట్ల రూపాయల మార్కెట్ చేస్తున్నాడు. ఇప్పుడీ లిస్ట్ లోకి శిరీష్ కూడా చేరాడు. తాజా హిట్ తో 10కోట్ల షేర్ అందుకున్నాడు.

సో.. ఈ లెక్కలన్నీ కలుపుకుంటే… ఏడాదిలో ఒక్క మెగా కాంపౌండ్ లోనే 3వందల కోట్ల రూపాయల టర్నోవర్ జరుగుతోంది. సౌత్ లో సూపర్ స్టార్ రజనీకాంత్, అటు బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ సినిమాలకు కూడా ఇంత టర్నోవర్ లేదు.