మెగా బంపర్ ఆఫర్

Monday,December 05,2016 - 10:31 by Z_CLU

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ధృవ సినిమాతో ఎంటర్టైన్ చేయడానికి రెడీ అయిపోయాడు. ఈ నెల 9న విడుదల కానున్న ఈ సినిమాకు సంబంధించి లేటెస్ట్ గా ప్రీ రిలీజ్ ఫంక్షన్  గ్రాండ్ గా నిర్వహించారు యూనిట్. అయితే ఈ ఈవెంట్ లో మెగా అభిమానులకు ఊహించని  బంపర్ అఫర్ ఇచ్చింది ధృవ టీం. ఈ వేడుకలో మెగా స్టార్ చిరు నటిస్తున్న ‘ఖైదీ నంబర్ 150’ సినిమాకు సంబంధించి మెగా పోస్టర్ ను రిలీజ్ చేసి ఫాన్స్ ను ఖుషి చేశారు.

      అయితే ఈ లుక్ తో పాటు మెగా ఫాన్స్ కి మరో బంపర్ అఫర్ అందించననున్నట్లు తెలిపాడు  చెర్రీ. ఈ నెల 8 న మెగా స్టార్ లేటెస్ట్ సినిమా ‘ఖైదీ నంబర్ 150’ టీజర్ ను రిలీజ్ చేసి  తన ధృవ సినిమాతో పాటు థియేటర్స్ లో ప్రదర్శించడానికి రెడీ అయ్యాడట.  ఈ విషయాన్నీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో అనౌన్స్ చేసాడు  చెర్రీ. ఇక ధృవ తో పాటు మెగా టీజర్ కూడా కలిసి రావడం తో మెగా ఫాన్స్ లో ఆనందం తో కూడిన ఉత్కంఠ నెలకొంది…