150వ సినిమాకు మెగా హంగులు

Friday,August 05,2016 - 11:05 by Z_CLU

ప్రస్తుతం తన 150వ సినిమా పనిలో చిరంజీవి బిజీగా ఉన్నాడు. వీవీ వినాయక్ దర్శకత్వంలో ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కాజల్ హీరోయిన్ గా ఎంపికైన ఈ సినిమాలో… అభిమానుల్ని దృష్టిలో పెట్టుకొని మరిన్ని హంగులు యాడ్ చేస్తున్నారు. కామెడీ పంచ్ లతో పాటు… ఫ్యాన్స్ కు ఎంతో ఇష్టమైన చిరంజీవి సిగ్నేచర్ స్టెప్పుల్ని…. 150వ సినిమాతో మరోసారి గుర్తుచేయబోతున్నారు.

కత్తిలాంటోడు సినిమాలో చిరంజీవి వీణ స్టెప్పు కచ్చితంగా ఉంటుందని సమాచారం. వీటితో పాటు… ఘరానా మొగుడు, గ్యాంగ్ లీడర్, జగదేకవీరుడు-అతిలోకసుందరి, ఠాగూర్, శంకర్ దాదా ఎంబీబీఎస్ లాంటి హిట్ సినిమాల్లోని సిగ్నేచర్ స్టెప్స్ ను 150వ సినిమాలో చూపించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా.. ఈనెల 22న ఈ సినిమా టైటిల్ ను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఖైదీ నంబర్ 150 అనే టైటిల్ పై జోరుగా ఊహాగానాలు సాగుతున్నాయి.