మెగా సంబరంలో చందమామ

Wednesday,November 16,2016 - 10:24 by Z_CLU

టాలీవుడ్ చందమామ కాజల్ తో ఆడి పాడాలని ఇప్పుడిప్పుడే నిలదొక్కుకున్న హీరోలే కాదు. స్టార్ హీరోలు కూడా కోరుకుంటారు. అలాంటి కాజల్ మెగాస్టార్ తో కలిసి స్టెప్పులేయడం తన అదృష్టంగా ఫీల్ అవుతుంది.

రీసెంట్ గా యూరోప్ లోని బ్యూటీఫుల్ లొకేషన్స్ స్లొవేనియా, క్రొయేషియా లాంటి అరుదైన ప్రదేశాల్లో సాంగ్స్ షూటింగ్ జరుపుకుంది ఖైదీ నం 150 యూనిట్. మెగాస్టార్ తో పని చేయడం తన కరియర్ లోనే ది బెస్ట్ అచీవ్ మెంట్ అని సంబరపడిపోతున్న కాజల్, మెగాస్టార్ ఇద్దరూ షూటింగ్ సమయంలో ఇలా చిక్కారు కెమెరాకి. ఇప్పుడు సోషల్ నెట్ వర్క్ లో ఇదే హాట్ హాట్ ఎలిమెంట్.