ఆగష్టులో చిరంజీవి సినిమా

Monday,April 24,2017 - 09:00 by Z_CLU

మెగాస్టార్ ఖైదీ నం 150 రిలీజై సక్సెస్ ఫుల్ గా 100 రోజులయింది. అప్పుడెప్పుడో రామ్ చరణ్ మెగా నెక్స్ట్ ఫిలిం సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో అని కన్ఫం చేసినా సినిమా ఇంకా సెట్స్ పైకి రాలేదు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్న ఈ సినిమా రోజులు గడుస్తున్న కొద్దీ ఫ్యాన్స్ లో క్యూరాసిటీ రేజ్ చేస్తుంది. అయితే రీసెంట్ గా చెర్రీ ఈ సినిమాపై ఇచ్చిన క్లారిటీ ఫ్యాన్స్ కాస్తంత ఊరట నిచ్చింది.

రామ్ చరణ్ సుకుమార్ సినిమా ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అవ్వడంతో అక్కడ ఫ్యాన్స్ తో చాలాసేపు మాట్లాడాడు చెర్రీ. అప్పుడు ఒక ఫ్యాన్ మెగా 151 అప్ డేట్స్ అడగడంతో “నాన్నగారి సినిమా ఆగష్టు నుండి సెట్స్ పైకి వస్తుంది” అని క్లారిటీ ఇచ్చాడు రామ్ చరణ్.

మెగాస్టార్ కరియర్ లోనే ఎప్పుడూ చేయని క్యారెక్టర్ లో ఈ సినిమాలో కనిపించబోతున్నారని చెప్పిన రామ్ చరణ్,  ‘ఖైదీ నం 150’ లాగే ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ గ్యారంటీ అని కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఈ సినిమాని  కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై రామ్ చరణ్ నిర్మిస్తున్నాడు.