Meet Cute - నాని బ్యానర్ పై మరో సినిమా
Monday,June 14,2021 - 07:08 by Z_CLU
ఊహించని విధంగా సడెన్ గా కొత్త సినిమా డీటెయిల్స్ తో వచ్చాడు నాని. Meet Cute అనే సినిమాను ఎనౌన్స్ చేశాడు. ప్రకటించడమే కాదు, ఆ సినిమా లాంఛింగ్ కూడా ఈరోజు జరిగిపోయింది. దానికి సంబంధించి 2 స్టిల్స్ కూడా నాని స్వయంగా రిలీజ్ చేశాడు.
అయితే ఇది నాని హీరోగా నటిస్తున్న సినిమా కాదు. తన సొంత బ్యానర్ వాల్ పోస్టర్ సినిమాపై నిర్మాతగా నాని తెరకెక్కిస్తున్న సినిమా. ఈ ప్రాజెక్టుకు మరో ప్రత్యేకత ఏంటంటే.. నాని సిస్టర్ దీప్తి ఈ మూవీతో డైరక్టర్ గా పరిచయమౌతున్నారు.
మీట్ క్యూట్ అనేది ఓ ఫిమేల్ సబ్జెక్ట్. ఇందులో ముగ్గురు నలుగురు హీరోయిన్లు నటిస్తారని టాక్. ఈరోజు లొకేషన్ లో మాత్రం ఎవ్వరూ కనిపించలేదు. కేవలం సత్యరాజ్ మాత్రమే కనిపించాడు. అతడిపైనే పస్ట్ షాట్ కు క్లాప్ కొట్టాడు నాని. కరోనా వల్ల గ్రాండ్ గా జరగాల్సిన లాంఛింగ్ గుంభనంగా జరిగిపోయింది. హీరోయిన్లు ఎవరనే విషయాన్ని త్వరలోనే వెల్లడిస్తారు.

విభిన్న సినిమాలు నిర్మిస్తానంటూ వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పెట్టాడు నాని. చెప్పినట్టుగానే ”అ!” అనే సినిమాతో ఆకట్టుకున్నాడు. తర్వాత హిట్ తో నిజంగానే హిట్ కొట్టాడు. ఇక హిట్-2ను కూడా స్టార్ట్ చేశాడు. ఇప్పుడు తన బ్యానర్ పై నాలుగో సినిమాగా Meet Cute ను లాంఛ్ చేశాడు నాని.
నాని, తిపిర్నేని ప్రశాంతి నిర్మిస్తున్న ఈ సినిమాకు విజయ్ బుల్గానిన్ సంగీతం అందించబోతున్నాడు. మిగతా వివరాల్ని త్వరలోనే వెల్లడిస్తానంటున్నాడు నాని.
- – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics