‘దూకుడు’ నుండి ‘మహర్షి’ వరకు – మీనాక్షి దీక్షిత్

Sunday,April 14,2019 - 11:02 by Z_CLU

‘మహర్షి’ హీరోయిన్ అనగానే గుర్తొచ్చేది పూజా హెగ్డే. ఫీమేల్ లీడ్ తనే. కాకపోతే సినిమాతో ఇంకో హీరోయిన్ కూడా ఉంది… మీనాక్షి దీక్షిత్. అయితే మీనాక్షికి మహేష్ బాబుతో స్క్రీన్ షేర్ చేసుకోవడం ఇదే ఫస్ట్ టైమ్ కాదు గతంలో కూడా నటించింది. జస్ట్ ఒక్క మహేష్ బాబు మాత్రమే మీనాక్షి ఫిల్మోగ్రఫీ లో NTR,రవితేజ, వెంకీ లాంటి బడా స్టార్స్ కూడా ఉన్నారు.

నిజానికి మీనాక్షి దీక్షిత్ పరిచయం అయింది ‘లైఫ్ స్టైల్’ అనే చిన్న సినిమాలో హీరోయిన్ గానే అయినా కరియర్ పై ఇంపాక్ట్ చూపించింది మాత్రం ‘దూకుడు’ సినిమా. అదేంటి..? ‘దూకుడు’ సినిమాలో సమంతా కదా హీరోయిన్ మీనాక్షి ఎక్కడుంది అనుకుంటున్నారా..? టైటిల్ ట్రాక్ లో  కనిపించింది మీనాక్షి. నిజానికి మీనాక్షి అసలు సిసలు తెలుగు సినిమా కరియర్ బిగిన్ అయింది అక్కడే.

నిజానికి స్పెషల్ సాంగ్స్ కే పరిమితం కావాలన్నది మీనాక్షి ఉద్దేశం కాకపోయినా, స్టార్ హీరోస్ సరసన చాన్స్ అనేసరికి ఎవరు వదులుకుంటారు. దూకుడు క్రియేట్ చేసిన ఇంపాక్ట్ ని అక్షరాలా వాడేసుకుంది మీనాక్షి వరసగా NTR తో బాద్షా, రవితేజ ‘దరువు’, వెంకీ ‘బాడీగార్డ్’ సినిమాలో కూడా స్పెషల్ సాంగ్ లో మెస్మరైజ్ చేసింది. అయితే ‘మహర్షి’ తో కరియర్ లో మరో మెట్టెక్క నుంది.

‘మహర్షి’ లో జస్ట్ స్పెషల్ సాంగ్ కే పరిమితం కావట్లేదు మీనాక్షి. ఎంతసేపు అనేది ఎగ్జ్జాక్ట్ గా చెప్పలేం కానీ, మహేష్ బాబు సరసన ఆల్మోస్ట్ ఫ్యాన్స్ దృష్టిలో రిజిస్టర్ అయ్యే స్థాయిలో అయితే ఈ అమ్మడు రోల్ ఉండబోతుందట. ఇంకా అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే అందలేదు కానీ, ఓ టైమ్ పీరియడ్ లో ‘రిషి’ గర్ల్ ఫ్రెండ్ రోల్ అని కూడా వినిపిస్తుంది. అదే గనక నిజమైతే మీనాక్షి దశ తిరిగినట్టే. టాలీవుడ్ కి కొత్త గ్లామరస్ హీరోయిన్ దొరికినట్టే.