MCA సెకండ్ సింగిల్ రేపే రిలీజ్

Tuesday,November 28,2017 - 12:25 by Z_CLU

నాని MCA సెకండ్ సింగిల్ రేపు రిలీజ్ అవుతుంది. రీసెంట్ గా రిలీజైన ఈ మూవీ టైటిల్ సాంగ్ నాని ఫ్యాన్స్ తో పాటు DSP ఫ్యాన్స్ ని కూడా ఆల్మోస్ట్ ఇంప్రెస్ చేసేసింది. అయితే ‘కొత్తగా..” అంటూ సాగే రొమాంటిక్ మెలోడీని రేపు రిలీజ్ చేయనున్నారు మేకర్స్.

నాని సరసన సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా టీజర్ ఇప్పటికే నాని ఫ్యాన్స్ లో క్యూరాసిటీ రేజ్ చేయడంలో సూపర్ సక్సెస్ అయింది. డిసెంబర్ 21 రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న ఈ సినిమా విషయంలో పాజిటివ్ బజ్ వినిపిస్తుంది. ఈ సినిమాలో భూమిక కీ రోల్ ప్లే చేస్తుంది. వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకి దిల్ రాజు నిర్మాత.