మే నెల బాక్సాఫీస్ రివ్యూ

Wednesday,June 05,2019 - 01:02 by Z_CLU

మే నెలలో 18 స్ట్రయిట్ సినిమాలు రిలీజ్ అయ్యాయి. వీటిలో పెద్ద సినిమా ఒకే ఒక్కటి అదే మహర్షి. ఈ సినిమాతో పాటు వచ్చిన సినిమాల్లో ఏవి హిట్ అయ్యాయిఏవి ఫ్లాప్ అయ్యాయిఓవరాల్ గా మే నెల బాక్సాఫీస్ రివ్యూ.

మే ఫస్ట్ వీకెండ్ లో గీతా ఛలోనువ్వు తోపురాఒకటే లైఫ్ సినిమాలు రిలీజ్ అయ్యాయి. వీటిలో కాస్త అంచనాలు పెంచిన సినిమా నువ్వు తోపురా మాత్రమే. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఫేమ్ సుధాకర్ నటించిన సినిమా కావడంప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉండడంస్వయంగా విజయ్ దేవరకొండ ప్రమోట్ చేయడం ఈ సినిమాకు బజ్ తీసుకొచ్చాయి. కానీ ఆ క్రేజ్ ను “నువ్వు తోపురా” సినిమా నిలుపుకోలేకపోయింది. ఈ మూవీతో పాటు వచ్చిన గీతాఛలోఒకటే లైఫ్ సినిమాలు ఫ్లాప్ అయ్యాయి.

మే మొదటి వారంలో మహర్షికీ సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి. వీటిలో  మహర్షి సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో థియేటర్లు కేటాయించడంతో కీ సినిమాకు స్క్రీన్స్ తగ్గిపోయాయి. అలా రిలీజైన మొదటి రోజు నుంచే సైడ్ అయిపోయింది జీవా నటించిన కీ సినిమా. ఇక మహర్షి విషయానికొస్తేమహేష్ కెరీర్ లోనే ప్రతిష్టాత్మక 25వ చిత్రంగా వచ్చిన ఈ మూవీఅతడి కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. వరల్డ్ వైడ్ ఏకంగా 175 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసిస్టిల్ ఇంకా థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా నడుస్తోంది.


ఇక రెండో వారంలో ఎంతవారలైనారొమాంటిక్ క్రిమినల్స్ఏపీసీడీ సినిమాలు వచ్చాయి. వీటిలో ఎంతవారలైనారొమాంటిక్ క్రిమినల్స్ సినిమాలు ఫ్లాప్ అవ్వగాఏబీసీడీ ఆడియన్స్ ను ఎట్రాక్ట్ చేసింది. అల్లు శిరీష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనర్ గా నిలిచింది.

తేజ డైరక్ట్ చేసిన సీత సినిమాతో మే థర్డ్ వీక్ ఓపెన్ అయింది. బెల్లంకొండ సాయిశ్రీనివాస్కాజల్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ఓ మోస్తరుగా మాత్రమే ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ఈ సినిమాతో పాటు లిసాఎవడు తక్కువ కాదు సినిమాలు కూడా వచ్చాయి. అంజలి నటించిన హారర్ సినిమా లిసా. మొట్టమొదటి త్రీడీ హారర్ సినిమాగా పేరుతెచ్చుకున్న ఈ సినిమా ప్రేక్షకుల్ని ఎట్రాక్ట్ చేయలేకపోయింది. మరోవైపు ఎవడు తక్కువ కాదు అనే మరో సినిమా కూడా ఫెయిలైంది.


లాస్ట్ వీక్ లో ‘అభినేత్రి-2′, ‘ఫలక్ నుమా దాస్’, ‘ఎన్ జీ కే’ సినిమాలు రిలీజ్ అయ్యాయి. వీటిలో సూర్య నటించిన ఎన్ జీ కే సినిమాకు మంచి ఓపెనింగ్స్ వచ్చాయి కానీ పాజిటివ్ టాక్ మాత్రం తెచ్చుకోలేకపోయింది. ఇక ఫలక్ నుమా దాస్ సినిమాకు మంచి టాక్ అయితే వచ్చింది కానీ కలెక్షన్లు మాత్రం తెచ్చుకోలేకపోతోంది. ఈ రెండు సినిమాల మధ్య వచ్చిన అభినేత్రి-సినిమా అటు టాక్ కు,ఇటు కలెక్షన్లకు దూరంగా అట్టర్ ఫ్లాప్ అయింది.