బ్యాక్ విత్ బ్యాంగ్ అంటున్న మాసివ్ డైరెక్టర్

Friday,July 21,2017 - 01:25 by Z_CLU

రెండేళ్ళ క్రితం సాయి ధరం తేజ్ తో ‘రేయ్’ సినిమా తరవాత రెండేళ్ళు లాంగ్ బ్రేక్ తీసుకున్న మాసివ్ డైరెక్టర్ Y.V.S. చౌదరి తన నెక్స్ట్ సినిమా ప్రిపరేషన్స్ లో ఉన్నాడు. మరో అల్టిమేట్ రొమాంటిక్ ఎంటర్ టైనింగ్ స్క్రిప్ట్ ని రెడీ చేసుకున్న Y.V.S. ఈసారి కొత్త నటీనటులను ఇంట్రడ్యూస్ చేసే ఆలోచనలో ఉన్నాడు.

గతంలో సీతయ్య, దేవదాసు, ఒక్క మగాడు లాంటి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో కమర్షియల్ డైరెక్టర్ అనిపించుకున్న Y.V.S. మరి ఈ సినిమాని తన సొంత బ్యానర్ లో నిర్మిస్తాడా..? లేకపోతే ప్రొడ్యూసర్ ఎవరా అనే డీటేల్స్ తో పాటు , ఈ సినిమాకి సంబంధించిన తక్కిన టెక్నీషియన్స్ కి సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.