Dhamaka ఫస్ట్ డే కలెక్షన్స్

Saturday,December 24,2022 - 05:11 by Z_CLU

మాస్ మహారాజా రవితేజ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ధమాకా’ నిన్ననే ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. రవితేజ ఎనర్జీని, మాస్‌ని ఆకట్టుకునే ఎలిమెంట్స్‌ని మాస్‌ ఆడియన్స్ ఎంజాయ్‌ చేస్తుండగా, ఫ్యామిలీ ఆడియన్స్‌ కి కూడా కావల్సినంత ఎంటర్‌టైన్‌మెంట్‌ని అందించడంతో థియేటర్‌లకు తరలివస్తున్నారు. దర్శకుడు త్రినాధ రావు నక్కిన డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో రవితేజ నుండి ఆశించే అన్ని అంశాలను చక్కగా కుదరంతో మొదటి రోజు బ భారీ ఓపెనింగ్స్ అందుకుంది. బాక్సాఫీస్ వద్ద రవితేజకు ధమాకా బిగ్గెస్ట్ ఓపెనర్‌గా నిలిచింది.

ఈ సినిమా మాస్‌తో పాటు క్లాస్ సెంటర్స్‌లోనూ అనూహ్యంగా బిజినెస్ చేసింది. చాలా సెంటర్లలో హౌస్‌ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి.  షో బై షో ప్రేక్షకుల రాక పెరుగుతుంది.  నైజాంతో సహా చాలా సెంటర్లలో రవితేజకి ధమాకా బిగ్గెస్ట్ డే వన్ గ్రాసర్‌గా నిలిచింది. ఓవరాల్‌గా, ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా మొదటి రోజు 10Cr+ వసూలు చేసింది.   ఆదివారం మరియు క్రిస్మస్ సెలవులు కావడంతో ఈ వీకెండ్ సినిమా భారీ గా కలెక్ట్ చేసే అవకాశం కనిపిస్తుంది.

 

 

  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics