మాస్ మహారాజ్ కెరియర్ హైలైట్స్

Thursday,January 26,2017 - 11:10 by Z_CLU

మాస్ కు పర్ ఫెక్ట్ ఎగ్జాంపుల్ రవితేజ. అందుకే రవితేజ మాస్ రాజా అయ్యాడు. ఈ హీరో సినిమాలు చూస్తే ఎనర్జీ వస్తుంది. మనకి కూడా అలా ఉండాలని అనిపిస్తుంది. డిఫరెంట్ మేనరిజమ్స్, డైలాగ్ డెలివరీకి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన మాస్ రాజా పుట్టినరోజు ఈరోజు.

02

01

జనవరి 26, 1968 న పుట్టాడు మన మాస్ మహారాజ్ రవితేజ. ఈరోజు తన 49 వ పుట్టిన రోజు సెలెబ్రేట్ చేసుకుంటున్నాడు. ఫ్యాన్స్ మాస్ మహారాజ్ అని ముద్దుగా పిలుచుకునే రవితేజ అసలు పేరు రవిశంకర రాజు భూపతి రాజు.  రాజ్యలక్ష్మి, రాజగోపాల రాజు అమ్మానాన్నల  పేర్లు. పుట్టింది కృష్ణా జిల్లా జగ్గంపేట.

03

రవితేజ అంత ఈజీగా ఈ స్థాయికి రాలేదు. ఈ స్టార్ డమ్ వెనక ఎంతో స్ట్రగుల్ ఉంది. చిన్న చిన్న క్యారెక్టర్స్ చేస్తూ, నెగెటివ్ రోల్స్ చేసుకుంటూ కరియర్ ని ప్లాన్ చేసుకున్న టైంలో పడింది కృష్ణవంశీ డైరెక్షన్ లో వచ్చిన సింధూరం. ఈ సినిమాతోనే చాలా మంది ఫిలిం మేకర్స్ దృష్టిలో పడ్డాడు రవితేజ. మాస్ రాజా స్టయిల్, డైలాగ్ డెలివరీ ఈ సినిమాతోనే బయటకొచ్చింది.

04

 రవితేజలోని మంచి పర్ఫార్మార్ ని ఎలివేట్ చేసిన సినిమా ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం. పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా తర్వాత రవితేజ మళ్ళీ వెనక్కితిరిగి చూడలేదు. బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్స్ మొదలైంది ఈ సినిమాతోనే.

05

2002… రవితేజ కరియర్ లో గోల్డెన్ ఇయర్. అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు, ఇడియట్, ఖడ్గం సినిమాలు సూపర్ హిట్ అవ్వడం రవితేజ లోని బెస్ట్ యాక్టర్ ని ఎలివేట్ చేశాయి. ఈ సినిమాలన్నీ ఒకే ఇయర్ లో వచ్చి రవితేజను స్టార్ ను చేశాయి.

06

 డిఫెరెంట్ వేరియేషన్స్ తో తెరకెక్కిన అమ్మా నాన్న తమిళ అమ్మాయి సినిమాలో బెస్ట్ పర్ఫామెన్స్ తో మెస్మరైజ్ చేశాడు రవితేజ. రవితేజ కెరీర్ ను మరో మెట్టు పైకి తీసుకెళ్లింది ఈ సినిమా.

07

 అల్టిమేట్ మాస్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్ ని సెలక్ట్ చేసుకునే రవితేజ, కామెడీకి కూడా అంతే ప్రిఫరెన్స్ ఇస్తాడు. తన కరియర్ లో బెస్ట్ హిలేరియస్ ఎంటర్ టైనర్ గా నిలిచింది వెంకీ సినిమా.

08

రవితేజ కరియర్ లో బిగ్గెస్ట్ హిట్స్ కిక్, విక్రమార్కుడు. ఈ సినిమాలు ఎచీవ్ చేసిన సక్సెస్ ఏకంగా టాలీవుడ్ స్టాండర్డ్స్ నే మార్చేశాయి.

 09

తన పుట్టినరోజు సందర్భంగా కొత్త సినిమా ఎనౌన్స్ చేశాడు మాస్ మహారాజ్. దీని పేరు టచ్ చేసి చూడు. విక్రమ్ సిరికొండ డైరక్షన్ లో వచ్చేనెల నుంచి ఈ సినిమా సెట్స్ పైకి రాబోతోంది.