డిస్కో రాజాగా ముస్తాబైన మాస్ రాజా

Saturday,January 26,2019 - 01:01 by Z_CLU

మాస్ మ‌హారాజా ర‌వితేజ మ‌రో ప‌వ‌ర్ ఫుల్ మాస్ అండ్ క్లాస్ సినిమాతో సినీ అభిమానులు ముందుకి రాబోతున్నారు. డిఫ‌రెంట్ కాన్సెప్టుల్ని త‌న క‌థాంశాలుగా ఎంచుకుంటూ అటు విమ‌ర్శ‌కులు ఇటు ప్రేక్ష‌కుల‌ ఆద‌ర‌ణ అందుకుంటున్న క్రియేటివ్ డైరెక్ట‌ర్ వి.ఐ.ఆనంద్ డైరెక్ష‌న్ లో ఈ చిత్రం తెర‌కెక్క‌నుంది.

ఎస్ ఆర్ టి ఎంట‌ర్ టైన్మెంట్స్ ప‌తాకం పై ప్ర‌ముఖ నిర్మాత రామ్ త‌ళ్లూరి ఈ చిత్రాన్ని  అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్మిస్తున్నారు. మాస్ మ‌హారాజా ర‌వితేజ ఎన‌ర్జీకి స‌రిపోయే విధంగా ఈ సినిమాకు డిస్కో రాజా అనే టైటిల్ ని ఖ‌రారు చేశారు. జ‌న‌వ‌రి 26 రిప‌బ్లిక్ డే తో పాటు ర‌వితేజ పుట్టిన రోజు సంద‌ర్భంగా డిస్కోరాజా టైటిల్ లోగోని విడుద‌ల చేశారు.

రవితేజ గారు ఇప్పటివరకు ట‌చ్ చేయని జాన‌ర్ లో ఈ సినిమా తెర‌కెక్క‌నుంది. ఓ విన్నూత్న‌మైన ఆంశాన్ని ఈ సినిమా క‌థాంశంగా తీసుకున్నారు. హైద‌రాబాద్ తో పాటు గోవా, చెన్నై, ల‌డాఖ్, మ‌నాలీలోతో పాటు నార్త్ ఇండియాలో కూడా కొన్ని చోట్ల ఈ సినిమాను చిత్రీక‌రించేందుకు ప్లాన్ చేస్తున్నారు. తమన్ ఈ సినిమాకు సంగీతం అందించబోతున్నాడు.

ముగ్గురు హీరోయిన్లు ఈ సినిమాలో ర‌వితేజ స‌ర‌స‌న న‌టించ‌నున్నారు. వీటిలో ఒక హీరోయిన్ గా పాయల్ రాజ్ పుత్ ను తీసుకున్నారు. ప్ర‌ముఖ న‌టుడు బాబీసింహా ఈ సినిమాలో విలన్ గా న‌టించ‌బోతున్నారు. క‌మీడియ‌న్స్ వెన్నెల‌కిషోర్, స‌త్య త‌దిత‌ర‌లు ఈ సినిమాలో కీల‌క పాత్ర‌లు పోషించ‌బోతున్నారు. త్వ‌ర‌లోనే ఫ‌స్ట్ షెడ్యూల్ ని ప్రారంభించేందుకు స‌న్నాహ‌లు చేస్తున్నారు.

సాంకేతిక వ‌ర్గం
బ్యానర్ : ఎస్ ఆర్ టి ఎంట‌ర్ టైన్మెంట్స్
నిర్మాత : రామ్ త‌ళ్లూరి
ద‌ర్శ‌కుడు : విఐ ఆనంద్
సినిమాటోగ్రాఫ‌ర్  : సాయి శ్రీరామ్
మ్యూజిక్ : థ‌మన్
ఎడిట‌ర్ : న‌వీన్ నూలి
పీఆర్ఓ : ఏలూరు శ్రీను