సెట్స్ పైకి వచ్చేసిన మాస్ మహారాజ్

Friday,February 03,2017 - 02:08 by Z_CLU

 రీసెంట్ గా ట్విట్టర్ వరల్డ్ లోకి ఎంట్రీ ఇచ్చిన మాస్ మహారాజ్ కి గ్రాండ్ వెల్కం చెప్పారు ఫ్యాన్స్. తన బర్త్ డే రోజు ఒకేసారి రెండేసి సినిమాలను అనౌన్స్ చేసిన రవితేజ, ఈ రోజు ‘టచ్ చేసి చూడు’ సినిమా సెట్స్ పైకి వచ్చేశాడు. ఈ విషయాన్ని స్వయంగా తానే వీడియో ట్వీట్ చేశాడు.

https://twitter.com/RaviTeja_offl/status/827392386426769408

అల్టిమేట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రాశిఖన్నాతో పాటు, లావణ్య త్రిపాఠి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. నల్లమలుపు బుజ్జి ఈ సినిమాని నిర్మిస్తున్నాడు.

వక్కంతం వంశీ రాసిన ఈ కథ విక్రమ్ సిరికొండ డైరెక్షన్ లో తెరకెక్కుతుంది. బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ ప్రీతమ్ ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. అసలే లాంగ్ గ్యాప్ తరవాత సెట్స్ పైకి వచ్చిన సినిమా కావడంతో,  మాస్ మహారాజ్ నుండి ఏ చిన్న అప్ డేట్ వచ్చినా గ్రాండ్ గా రిసీవ్ చేసుకుంటున్నారు ఫ్యాన్స్.