అదే రూట్ ఫాలో అవుతున్నాడు...

Sunday,August 27,2017 - 01:06 by Z_CLU

మొదట్లో యూత్ ఫుల్ సినిమాలతో దర్శకుడిగా ఇమేజ్ అందుకున్న మారుతి ‘భలే భలే మగాడివోయ్’ సినిమాతో దర్శకుడిగా స్పెషల్ కేటగిరీ లోకి వెళ్ళిపోయాడు. మతి మరుపు బలహీనతతో ఈ సినిమాను తెరకెక్కించి బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ అందుకున్న మారుతి ప్రెజెంట్ మళ్ళీ అదే రూట్ ను ఫాలో అవుతూ మరో సినిమాతో ఎంటర్టైన్ చేయడానికి రెడీ అవుతున్నాడు.

‘భలే భలే మగాడివోయ్’ సినిమా తర్వాత ‘అతి జాలి గుణం’ అనే బలహీనతతో ‘బాబు బంగారం’ సినిమా రూపొందించి మరో హిట్ అందుకున్న మారుతీ ప్రెజెంట్ ‘అతి శుభ్రం’ అనే బలహీనత ఉన్న యువకుడి కథతో ‘మహానుభావుడు’ చేస్తున్నాడు. శర్వానంద్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ తో మరో సారి తన మార్క్ ఎంటర్టైన్ మెంట్ తో ఈ సినిమా ఎంటర్టైన్ చేస్తుందని చెప్పకనే చెప్పాడు మారుతి. మరి దర్శకుడిగా మారుతి మరో సారి డిసార్డర్ క్యారెక్టర్ తో ఏ రేంజ్ హిట్ సాదిస్తాడో..చూడాలి.