మారుతి ఇంటర్వ్యూ

Thursday,September 28,2017 - 05:00 by Z_CLU

‘భలే భలే మగాడివోయ్’ తో దర్శకుడిగా స్టార్ ఇమేజ్ అందుకున్న మారుతి లేటెస్ట్ గా శర్వానంద్ తో తెరకెక్కించిన మ్యూజికల్ లవ్ ఎంటర్టైనర్ ‘మహానుభావుడు’.. ప్రస్తుతం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా రేపే థియేటర్స్ లోకి ఎంట్రీ ఇస్తుంది. ఈ సందర్భంగా ఈ సినిమా గురించి ప్రత్యేకంగా మీడియాతో ముచ్చటించాడు దర్శకుడు మారుతి.. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే..

 

అదే నా బలం

నిజానికి దర్శకుడిగా ఒక్కొక్కరికి ఒక్కో బలం ఉంటుంది. ఆ బలంతో ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేస్తుంటారు.. ఒక డిఫరెంట్ క్యారెక్టర్ చుట్టూ కథ ను అల్లి ఆ క్యారెక్టర్ తో రెండు గంటలు ఎంటర్టైన్ చేయడమే నాకున్న బలం. భలే భలే మగాడివోయ్ తో నా బలం ఏంటో తెలిసింది. అది తెలుసుకొనే అలాంటి డిఫరెంట్ క్యారెక్టర్స్ డిఫరెంట్ ఎంటర్టైన్ మెంట్ కథను రాసుకుంటూ సినిమాలు చేస్తున్నా.

 

అన్నిటికి సమాధానం సక్సెస్

నిజానికి ఏ దర్శకుడికైనా సక్సెస్సే ముఖ్యం..దాన్ని బట్టే మనపై అవతలి వాళ్ళకి ఓ అభిప్రాయం వస్తుంది. ఒక సూపర్ హిట్ సినిమా తీస్తే.. కథేంటి అని డీటెయిల్ గా కూడా అడగకుండానే కమిట్ అయిపోతారు. అదే ఆవరేజ్ సినిమా తీస్తే కొన్ని రోజులు ఆగక చెప్తా అంటారు. అదే మనం తీసిన సినిమా ఫ్లాప్ అనే టాక్ వస్తే ఇక మన ఫోన్ కూడా లిఫ్ట్ చేయరు.. అది పరిస్థితి సో ఎక్కడైనా సక్సెస్సే ప్రధానం. అదుంటేనే మనకి వేల్యూ.

 

ఆ విషయం పది నిమిషాల్లోనే తెలిసిపోతుంది

ఈ సినిమా టీజర్ రిలీజ్ చేయగానే మారుతి మళ్ళీ భలే భలే మగాడివోయ్ లాగే మరో వీక్నెస్ పెట్టి ఈ సినిమా తీసేసాడు..అండ్ టీజర్ చూస్తే మలయాళం లో వచ్చిన ఓ సినిమా లా ఉందే.. అనే కామెంట్స్ వచ్చాయి.. నిజానికి ఈ కథ అనుకోగానే ఓ.సి.డి మీద వరల్డ్ లో వచ్చిన అన్ని సినిమాలు చూశాను. కచ్చితంగా మహానుభావుడు సినిమాను మరే సినిమాతో పోల్చలేం . సినిమా చూస్తే అది పది నిమిషాల్లోనే తెలిసిపోతుంది.

అలా  పోల్చడం సంతోషమే…

నిజానికి ఈ సినిమాను భలే భలే మగాడివోయ్ సినిమాతో పోల్చడం సంతోషంగానే ఉంది. ఒక ఫ్లాప్ సినిమాతో పోలిస్తే బాధపడాలి కానీ సూపర్ హిట్ సినిమాతో పోలిస్తే హ్యాపీ గానే ఫీలవ్వాలి అనేది నా ఫీలింగ్. ఆ సినిమాతో పోల్చుకొని ఈ సినిమాకి వస్తే కచ్చితంగా రెండిటికీ తేడా ఉందని అందరికీ తెలుస్తుంది. ఒక్క క్యారెక్టరైజేషన్ లో తప్ప మరే ఎలిమెంట్ లోను రెండిటికీ పోలిక ఉండదు.

 

దర్శకుడి లో దమ్ముండాలి

నిజానికి దర్శకుడిగా స్టార్ హీరో తో సినిమా చేసిన యంగ్ హీరోతో సినిమా చేసిన పెద్దగా తేడా ఉండదు. ప్రేక్షకుల్లోనే ఆ తేడా ఉంటుంది. యంగ్ హీరో అంటే ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా థియేటర్స్ కి వస్తారు. స్టార్ హీరో అనేసరికి కొంచెం యాక్షన్ హీరోయిజం ఎక్స్పెక్ట్ చేసి వస్తారు.. అంతే తేడా. దర్శకుడిలో దమ్ముండాలి కానీ అలా ఎక్స్పెక్టేషన్ తో వచ్చే ఫాన్స్ ను కూడా కంటెంట్ తో ఎంటర్టైన్ చేయొచ్చు. అనేది నా భావన.

 

కథను బట్టే హీరో మారాలి

ఏ సినిమాకైనా కథను బట్టే హీరో మారాలి..హీరో కోసం కథ మారితే ఆ సినిమాకు అదే పెద్ద మైనస్ అవుతుంది. అందుకే నేను హీరోలను కలిసే ముందే నా వెర్షన్ లో నేనుంటాను. హీరో కోసం కథ కాకుండా..కథ కోసం హీరోలను వెతుకుతుంటా.

 

శర్వా లో  బెస్ట్ క్వాలిటీ  అదే

ఈ సినిమా చేసే ముందు శర్వా ఈ క్యారెక్టర్ ఎలా చేస్తే బాగుంటుందా.. అంటూ కన్ఫ్యూజన్ అయ్యాడు. ఈ క్యారెక్టర్ గురించి రిహాల్సస్ లాంటివేం వద్దు.. నువ్వు నువ్వుగానే సెట్ కి రా చాలు అని చెప్పాను. సెట్ లో అడుగుపెట్టిన మొదటి రోజే క్యారెక్టర్ లో పరకాయ ప్రవేశం చేసే యూనిట్ అందరినీ మెస్మరైజ్ చేసేశాడు. క్యారెక్టర్ కోసం తను పూర్తిగా మారే హీరో శర్వా.. అది శర్వాలో బాగా గమనించా.. అందుకే తను చేసిన ప్రతీ క్యారెక్టర్ ప్రేక్షకులకి బాగా గుర్తింది పోతాయి.

 

అఖిల్ తో చేద్దామనుకున్నా

ఈ కథ అనుకోగానే శర్వానంద్ తో చేయాలనుకున్నాను.. కానీ అనుకోకుండా అఖిల్ తో చేయాలనుకుని నాగార్జున గారికి అఖిల్ కి కూడా కథ చెప్పాను. నాగార్జున గారితో పాటు అఖిల్ కి కూడా ఈ స్క్రిప్ట్ బాగా నచ్చింది. కానీ అదే టైంలో అఖిల్ వేరే సినిమా పనుల్లో బిజీగా ఉండటం, ఇంకాస్త టైం పడుతుండడంతోనే దర్శకుడిగా ఎక్కువ గ్యాప్ ఉండకూడదనే ఉద్దేశ్యంతోనే నాకు అందుబాటులో ఉన్న నేను ముందే ఫిక్స్ అయిన శర్వా తోనే చేసేశాను.

 

థమన్ మ్యూజిక్ హైలైట్

మ్యూజికల్ లవ్ స్టోరీ తో తెరకెక్కనున్న సినిమా కాబట్టి మ్యూజిక్ డైరెక్టర్ గా ఎవరైతే బాగుంటుందా అనుకోని ఆలోచించాం. ఫైనల్ గా అందరం థమన్ కి ఫిక్స్ అయ్యాం. మేమనుకున్నట్లే మంచి ఆల్బమ్ తో పాటు డీసెంట్ బ్యాగ్రౌండ్ స్కోర్ తో అదరగొట్టేశాడు. సినిమాకు థమన్ మ్యూజిక్ ఏ హైలైట్ కానుంది.

చైతు తో అలాంటిదే ప్లాన్ చేస్తున్నా

చైతుతో చేసే సినిమా నా స్టైల్లోనే లవ్ ఫన్ ఎంటర్టైనర్ గానే ఉంటుంది. కానీ ఏ ఎలిమెంట్ ఆడ్ చేస్తే మళ్ళీ అందరిని ఎంటర్టైన్ చేయగలనో ఆలోచించి ఆ కథను రెడీ చేస్తా.

 

బన్నీ తో 100 % చేస్తా…

ఎప్పటి నుంచి బన్నీ తో సినిమా చేయాలనుకుంటున్నా.. ప్రస్తుతం మా ఇద్దరి కాంబినేషన్ ఎలాంటి సినిమా చేస్తే బాగుంటుందా..అనే డిస్కర్షన్స్ జరుగుతున్నాయి. కానీ బన్నీ తో 100 % చేస్తా. అదెప్పుడనేది మాత్రం ఇప్పుడు చెప్పలేను.

 

ప్రొడక్షన్ లో మూడు సినిమాలు

ఇప్పటికే మారుతీ టాకీస్ బ్యానర్ పై కొన్ని సినిమాలు తీశాను.. నిర్మాతగా మరిన్ని
మంచి సినిమాలు నిర్మించాలనుకుంటున్నాను.. ఇప్పటికే ప్రొడక్షన్ లో ఓ మూడు సినిమాల వర్క్ జరుగుతుంది. త్వరలోనే ఆ సినిమాలతో నిర్మాతగా ప్రేక్షకులను పలకరించబోతున్నా.