మారుతి ఇంటర్వ్యూ

Monday,July 30,2018 - 05:24 by Z_CLU

ప్రభాకర్ డైరెక్షన్ లో తెరకెక్కిన బ్రాండ్ బాబు ఆగష్టు 3 న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతుంది. సుమంత్ శైలేంద్ర, ఈషా రెబ్బ జంటగా నటించిన   ఈ సినిమాకి మరో డైరెక్టర్ మారుతి కథనందించారు. హిలేరియస్ ఎలిమెంట్స్ తో ఇమోషనల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా గురించి మారుతి మాటల్లో…

ఈ ఆలోచన అలా పుట్టింది…

‘భలే భలే మగాడివోయ్’ సక్సెస్ టూర్ లో అమెరికా వెళ్ళినప్పుడు అక్కడ జనాలు బ్రాండ్స్ కి ఇచ్చే వ్యాల్యూ చూసి, జనాలకు ఇంత బ్రాండ్ పిచ్చి ఉంటుందా అనిపించింది. అప్పుడే ఈ సినిమా చేయాలన్న ఆలోచన వచ్చింది.

అదే స్టోరీలైన్…

ఏ పని చేసినా బ్రాండ్ విలువ ఉండాలనుకునే వ్యక్తి, ఒక సాధారణ అమ్మాయిని ఇష్టపడి, ప్రేమ విలువ తెలుసుకుంటే ఎలా ఉంటుంది అనేదే ఈ సినిమా… సినిమా చివరిలో మంచి మెసేజ్ ఉంటుంది.

నాకిష్టమైన డైలాగ్స్…

కథ ఇష్టపడి రాసుకున్నా.. ఎవరైనా బాగా డైరెక్ట్ చేస్తే బావుంటుందని ప్రభాకర్ కి ఇచ్చాను. సినిమాలో కొన్ని కీలక సన్నివేశాల్లో నాకిష్టమైన డైలాగ్స్ రాసుకున్నాను.. వాటి ఇంపాక్ట్ సినిమాలో చాలా ఉంటుంది.

నా మార్క్ మిస్సవ్వదు…

మారుతి సినిమా అంటే ఎంటర్టైన్ మెంట్ గ్యారంటీ అనే ఒక బ్రాండ్  ఉంది. ఆ మార్క్ ఈ సినిమాలో మిస్ అవ్వదు…

అందుకే ప్రభాకర్…

నేను ప్రభాకర్ కి కథ చెప్పినప్పుడు చాలా ఇన్వాల్వ్ అయ్యాడు. ప్రతి సీన్ లో ఇమోషన్ ఎక్కడ ఉందో ఈజీగా పట్టేసేవాడు. వేరే కొత్త డైరెక్టర్ కి ఇస్తే అది పాసిబుల్ అయ్యేది కాదేమో…

చాలామంది కనెక్ట్ అవుతారు…

కొంతమంది స్టేటస్ మెయిన్ టైన్ చేసేవాళ్ళు ఇంట్లో ఎవరైనా చనిపోయినా ఏడవకూడదు, ఏడిస్తే బ్రాండ్ వ్యాల్యూ పడిపోతుంది అనుకుంటూ ఉంటారు. కనీసం తండ్రీ, కొడుకులు మాట్లాడుకోవాల్సి వచ్చినా, ఆ డిస్కర్షన్ లో కంటెంట్ ఏంటనేది ముందే ఫిక్స్ చేసుకుని మాట్లాడుకుంటూ ఉంటారు.. అలాంటి వాళ్ళందరికి రియలైజేషన్ ఈ సినిమా..

ప్రొడ్యూసర్ కూడా అంతే…

నిర్మాత శైలేంద్ర గారు కూడా వాళ్ళబ్బాయిని మాస్ హీరోలా, ఫైట్స్ చేస్తూ ఇంట్రడ్యూస్ చేయడం కన్నా, ఏదైనా కనెక్ట్ అయ్యే క్యారెక్టర్ లో ప్రెజెంట్ చేద్దామనుకున్నారు. సుమంత్ సినిమాలోని ప్రతి సీన్ లో పర్ఫెక్ట్ గా సింక్ అయ్యాడు..

అలా మొదలవుతుంది…

వేసుకునే బట్టలకే బ్రాండ్ వ్యాల్యూ చూసే మన ఇంట్లో కోడలుగా వచ్చే అమ్మాయి కూడా బ్రాండెడ్ గా ఉండాలి అని ఫీలయ్యే హీరో, హోమ్ మినిస్టర్ కూతురికి ట్రై చేస్తుంటాడు.. అయితే తన ఫోన్ ఆ ఇంటి పనిమనిషి దగ్గర ఉంటుంది. మన హీరో ఆ అమ్మాయే హోమ్ మినిస్టర్ కూతురని ఫిక్స్ అవుతాడు.. ఆ తరవాత ఆ అమ్మాయి జస్ట్ పనమ్మాయి అని తెలిస్తే ఏం చేశాడు..? ఏం తెలుసుకున్నాడు అనేదే సినిమాలో పాయింట్..

నా కాన్సెప్ట్…

మురళీ కృష్ణ డైరెక్షన్ లో రిలీజ్ కి రెడీ అవుతున్న ‘భలే మంచి చౌక బేరం’ సినిమాకి కాన్సెప్ట్ నేనే ఇచ్చాను. ఈ సినిమాను సెప్టెంబర్ లో రాధామోహన్ గారు ఈ సినిమాను రిలీజ్ చేస్తారు.