మే నెలలో నాగచైతన్య ‘శైలజా రెడ్డి అల్లుడు’ ఫస్ట్ లుక్

Saturday,March 24,2018 - 11:50 by Z_CLU

ప్రస్తుతం సవ్యసాచి సినిమాతో బిజీగా ఉన్నాడు నాగ చైతన్య. అయితే ఈ సినిమా సెట్స్ పై ఉండగానే చైతు, మారుతి డైరెక్షన్ లో ‘శైలజా రెడ్డి అల్లుడు’ సినిమాను సెట్స్ పైకి తీసుకువచ్చాడు. అయితే ఓ వైపు రిలీజ్ కి రెడీ అవుతున్న సవ్యసాచితో పాటు, ‘శైలజా రెడ్డి అల్లుడు’ సినిమాపై కంప్లీట్ ఫోకస్ పెట్టారు ఫ్యాన్స్.

ఫస్ట్ షెడ్యూల్ తరవాత మళ్ళీ సెకండ్ షెడ్యూల్ బిగిన్ చేయలేదు మారుతి. అయితే ఈ విషయంలో సోషల్ మీడియాలో ఫ్యాన్స్ రేజ్ చేస్తున్న క్వశ్చన్స్ కి ఒక ట్వీట్ తో క్లారిటీ ఇచ్చాడు మారుతి. సవ్యసాచి సినిమాకి ప్యాకప్ చెప్పీ చెప్పగానే, ‘శైలజా రెడ్డి అల్లుడు’ ట్రాక్ లోకి వచ్చేస్తుందని కన్ఫం చేశాడు. మ్యాగ్జిమం మే నెలలో  ఈ మూవీ ఫాస్ట్ లుక్ రిలీజయ్యే చాన్సేస్ ఉన్నాయని కూడా మెన్షన్ చేశాడు మారుతి.

అల్టిమేట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లా తెరకెక్కనున్న ఈ సినిమాలో చైతు సరసన అనూ ఇమ్మాన్యువెల్ హీరోయిన్ గా నటిస్తుంది. రమ్యకృష్ణ ఈ సినిమాలో శైలజా రెడ్డి రోల్ లో కనిపించనుంది. గోపీ సుందర్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న ఈ సినిమాను సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నాడు.