Tollywood Review - మార్చి నెల సినిమాల రివ్యూ

Saturday,April 03,2021 - 05:53 by Z_CLU

మార్చిలో టాలీవుడ్ లో అటుఇటుగా 20 సినిమాలు రిలీజ్ అయ్యాయి. ప్రతి వారం ఓ క్రేజీ మూవీ వచ్చింది. మార్చి నెలలో క్లిక్ అయిన సినిమాలేంటి, డిసప్పాయింట్ చేసిన మూవీస్ ఏంటి.. హేవే లుక్.

A1 ఎక్స్ ప్రెస్ మూవీ రివ్యూ

మార్చి మొదటి వారంలో ఏకంగా 10 సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి. వీటిలో ఏ1 ఎక్స్ ప్రెస్, షాదీ ముబాకర్ సినిమాలు ఆకట్టుకున్నాయి. సందీప్ కిషన్, లావణ్య త్రిపాఠి జంటగా నటించిన స్పోర్ట్స్ డ్రామా ఏ1 ఎక్స్ ప్రెస్, ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతినిచ్చింది.

షాదీ ముబారక్ మూవీ రివ్యూ

అటు చిన్న సినిమాగా వచ్చిన షాదీ ముబారక్, మొదటి ఆటకే హిట్ టాక్ తెచ్చుకుంది. బుల్లితెర స్టార్ సాగర్, హీరోగా నటించిన ఈ సినిమా సునిశితమైన హాస్యం, మంచి ఫ్యామిలీ ఎలిమెంట్స్ తో క్యూట్ మూవీ అనిపించుకుంది. ఈ రెండు మూవీస్ మినహా ఆ వారం వచ్చిన సినిమాలేవీ పెద్దగా ఎట్రాక్ట్ చేయలేకపోయాయి. పవర్ ప్లే, క్లైమాక్స్, దేవినేని, తోటబావి, మూవీ-A, శ్రీ పరమానందయ్య శిష్యుల కథ లాంటి మూవీస్ అన్నీ డిసప్పాయింట్ చేశాయి

ఇక మార్చి సెకండ్ వీక్ లో శ్రీకారం, జాతిరత్నాలు, గాలిసంపత్ సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి. వీటిలో జాతిరత్నాలు బ్లాక్ బస్టర్ హిట్టయింది. నవీన్ పొలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి హీరోలుగా నటించిన ఈ సినిమాలో థియేటర్లలో నవ్వుల సునామీ సృష్టించింది.

అటు జాతిరత్నాలతో పాటు వచ్చిన శ్రీకారం సినిమా మంచి సందేశాన్ని, ఎమోషన్స్ ను అందించింది. శర్వానంద్ హీరోగా నటించిన ఈ సినిమాను క్రిటిక్స్ సైతం మెచ్చుకున్నారు. ఇక శ్రీవిష్ణు నటించిన గాలిసంపత్ సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అయింది.

మార్చి మూడో వారంలో మోసగాళ్లు, చావుకబురు చల్లగా, శశి సినిమాలు రిలీజయ్యాయి. వీటిలో మంచు విష్ణు నటించిన మోసగాళ్లు, కార్తికేయ నటించిన చావుకబురు చల్లగా సినిమాలు భారీ అంచనాలతో వచ్చాయి. కానీ ఈ రెండు సినిమాలు ఆ అంచనాల్ని అందుకోలేకపోయాయి. ఇక ఆది సాయికుమార్ నటించిన శశి సినిమా, ఎలాంటి టాక్ జనరేట్ చేయకుండానే థియేటర్ల నుంచి వెళ్లిపోయింది.

మార్చి నాలుగో వారంలో రంగ్ దే సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. నితిన్-కీర్తిసురేష్ జంటగా నటించిన ఈ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో కే హిట్ టాక్ సొంతం చేసుకుంది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అటు ఫ్యామిలీ ఆడియన్స్ ను, ఇటు యూత్ ను ఎట్రాక్ట్ చేసి.. కంప్లీట్ మూవీ అనిపించుకుంది.

రంగ్ దేతో పాటు వచ్చిన అరణ్య పూర్తిస్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. రానా హీరోగా నటించిన ఈ సినిమా మంచి వసూళ్లు రాబట్టడంలో ఫెయిలైంది. ఈ సినిమాలతో పాటు వచ్చిన ఈ కథలో పాత్రలు కల్పితం, తెల్లవారితే గురువారం లాంటి సినిమాలు ఫ్లాప్ అయ్యాయి.