గ్రాండ్ గా రిలీజైన మరకతమణి ఆడియో

Monday,June 05,2017 - 10:16 by Z_CLU

ఎడ్వెంచరస్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో కంప్లీట్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన సినిమా మరకతమణి. ఆది పినిశెట్టి, నిక్కి గ‌ర్లాని హీరో హీరోయిన్లుగా శ‌ర‌వ‌ణ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో వస్తున్న ఈ సినిమా ఆడియో గ్రాండ్ గా రిలీజైంది. దిబు నైనన్‌ థామస్‌ సంగీతం అందించిన ఈ సినిమా పాటలు శ్రోతల్ని ఆకట్టుకుంటున్నాయి. హైదరాబాద్‌లో గ్రాండ్ గా జరిగిన ఈ ఆడియో ఫంక్షన్ కు హీరోలు నాని, అల్లరి నరేష్‌, దర్శకులు కిషోర్‌ తిరుమల, కళ్యాణ్‌ కృష్ణ, సంకల్ప్‌, రవికాంత్‌ పేరెపు, తనికెళ్ళభరణి, కోన వెంకట్‌ ప్రత్యేక అతిథిలుగా హాజరయ్యారు. ఆది పినిశెట్టి, నిక్కి గర్లాని జోడీ సెంటరాఫ్ ఎట్రాక్షన్ గా నిలిచింది. హీరో నాని ఆడియో సీడీలను విడుదల చేశారు.

కోన వెంకట్‌ మాట్లాడుతూ – ”ఎక్కడి వెళ్ళినా అక్కడున్న వారందరికి తక్కువ సమయంలోనే ఫ్యామిలీ మెంబర్‌ అయిపోయే గొప్ప లక్షణమున్న వ్యక్తి ఆది పినిశెట్టి. అలాగే తన స్క్రిప్ట్‌ సెలక్షన్స్‌ సూపర్బ్‌. మరకతమణి సినిమా కథ కూడా మారుతున్న ట్రెండ్‌కు అనుగుణంగా మంచి కాన్సెప్ట్‌తో రూపొందిన సినిమా ఇది. ఈ సినిమాలో పనిచేసిన నటీనటులు, టెక్నిషియన్స్‌కు అందరికీ ఆల్‌ ది బెస్ట్‌” అన్నారు.

సంకల్ప్‌ మాట్లాడుతూ – ”కాన్సెప్ట్‌ సినిమాలకు మంచి ట్రెండ్‌ స్టార్ట్‌ అయ్యింది. డిఫరెంట్‌ కాన్సెప్ట్‌ సినిమాను రూపొందించిన శరవణన్‌కు ఆల్‌ ది బెస్ట్‌. అందరికీ కంగ్రాట్స్‌” అన్నారు.

తనికెళ్ళభరణి మాట్లాడుతూ – ”టాలెంట్‌తో పాటు మంచి మనసున్న వ్యక్తి రవిరాజా పినిశెట్టిగారు. ఆయనలోని మంచి లక్షణాలన్నీ ఆదికి వచ్చాయి. తొలి నుండి ఆది డిఫరెంట్‌ కాన్సెప్ట్‌ సినిమాలనే చేస్తున్నాడు. మరకత మణి సినిమా తనకు పెద్ద హిట్‌ కావాలని కోరుకుంటున్నాను” అన్నారు.

కిషోర్‌ తిరుమల మాట్లాడుతూ – ”మంచి సంగీతం ఉంది. మంచి సినిమాటోగ్రఫీ కనపడుతుంది. ఎంటైర్‌ టీంకు ఆల్‌ ది బెస్ట్‌” అన్నారు.

అల్లరి నరేష్‌ మాట్లాడుతూ – ”ఆది తొమ్మిదేళ్ళుగా నాకు బాగా తెలుసు. సినిమా కోసం కొత్త నటీనటులు ఎలా ప్రయత్నిస్తారో అలా ప్రయత్నిస్తూ ఇప్పుడు ఈ స్థాయికి చేరుకున్నాడు. తను ఇంకా మంచి స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాను.

హీరో నాని మాట్లాడుతూ – ”మరకతమణి విషయానికి వస్తే సంగీతం చాలా బావుంది. ట్రైలర్‌ బావుంది. సినిమా పెద్ద హిట్‌ కావాలని కోరుకుంటున్నాను” అన్నారు.

ఆది పినిశెట్టి మాట్లాడుతూ – ”సినిమా స్క్రిప్ట్‌ బేస్‌డ్‌ మూవీ. ఓ ఐదుగురి క్యారెక్టర్స్‌ను బేస్‌ చేసుకుని రన్‌ అవుతుంటుంది. స్క్రిప్టే సినిమాలో హీరో. ఇప్పటి వరకు నేను సీరియస్‌ పాత్రలే చేశాను. నేను నటించిన తొలి కామెడి సినిమా అని చెప్పొచ్చు” అన్నారు.