జూన్ 16 న మరకతమణి రిలీజ్

Friday,June 09,2017 - 12:12 by Z_CLU

జూన్ 16 న రిలీజ్ కి రెడీ అవుతుంది అడ్వెంచరస్ యాక్షన్ థ్రిల్లర్ ‘మరకతమణి’.  ఆది పినిశెట్టి, నిక్కి గర్లాని జంటగా నటించిన ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రిలీజవుతుంది. ఈ సినిమాకి A.R.K. శరవణన్ డైరెక్టర్.

 

నెగెటివ్ రోల్ చేసినా, హీరో క్యారెక్టర్ చేసినా ఆంగ్రీ యంగ్ మ్యాన్ లా సీరియస్ రోల్స్ లో ఎంటర్ టైన్ చేసే ఆది ఈ సినిమాలో ఫుల్ టూ కామెడీ ఎలిమెంట్స్ తో థ్రిల్ చేయబోతున్నాడు. దాంతో పాటు రీసెంట్ గా రిలీజైన మ్యూజిక్ సినిమాకి బిగ్గెస్ట్ ఎసెట్ అని కాన్ఫిడెంట్ గా ఉంది సినిమా యూనిట్.  అల్టిమేట్ సస్పెన్స్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన ఈ సినిమాకి దిబు నైనన్ థామస్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు.