భాగమతిని హిట్ చేసిన ప్రేక్షకులకు థ్యాంక్స్

Monday,January 29,2018 - 11:03 by Z_CLU

అనుష్క ముఖ్య పాత్రలో తెరకెక్కించిన భాగమతి చిత్రం సూపర్ హిట్ టాక్ తో… భారీ ఓపెనింగ్స్ తో.. కలెక్షన్స్ వర్షం కురిపిస్తోంది. అనుష్క నటన, అశోక్ డైరెక్షన్ స్కిల్స్, మాధి కెమెరా వర్క్, రవీందర్ ప్రొడక్షన్ డిజైన్, థమన్ మ్యూజిక్, యూవీ క్రెయేషన్స్ నిర్మాణ విలువలతో ఆడియన్స్ ని మెస్మరైజ్ చేస్తోంది. ఈ సినిమా హిట్ అయినందుకు ఫుల్ హ్యాపీగా ఉంది అనుష్క.

“నా కెరీర్ లో మర్చిపోలేని సూపర్ హిట్ చిత్రాన్ని అందించిన డైరెక్టర్ అశోక్ గారికి, యూవీ క్రియేషన్స్ బ్యానర్ టీం కు స్పెషల్ థాంక్స్. భాగమతి కోసం 4 సంవత్సరాలు గా కష్టపడ్డారు. భాగమతి చిత్రంతో ఘన విజయం అందించిన అందరికి చాలా థాంక్స్. నేను నటించే ప్రతి సినిమాను ఆదరిస్తున్న నా అభిమానులకు, శ్రేయోభిలాషులకు ప్రత్యేక ధన్యవాదాలు.” భాగమతి సక్సెస్ తర్వాత  అనుష్క రియాక్షన్ ఇది.

తెలుగు రాష్ట్రాల్లో విడుదలైన మొదటి రోజే 5 కోట్ల రూపాయల షేర్ రాబట్టిన ఈ సినిమా, ఓవర్సీస్ లో హాఫ్-మిలియన్ మార్క్ దాటింది. త్వరలోనే ఇటు తెలుగు రాష్ట్రాల్లో 10 కోట్లు, ఓవర్సీస్ లో మిలియన్ మార్క్ అందుకోబోతోంది.