'మనోజ్ నందం' ఇంటర్వ్యూ

Tuesday,October 24,2017 - 02:35 by Z_CLU

అల్టిమేట్ హారర్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ‘దేవి శ్రీ ప్రసాద్’ రిలీజ్ కి రెడీ అవుతుంది. ధనరాజ్, మనోజ్ నందమ్, భూపాల్ రాజు కీ రోల్ ప్లే చేస్తున్న ఈ సినిమాలో పూజా రామచంద్రన్ ఫీమేల్ లీడ్ గా నటించింది. శ్రీ కిషోర్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఈ సందర్భంగా ఈ సినిమాకు సంబంధించి ఇంటరెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నాడు మనోజ్ నందమ్. ఆ విశేషాలు మీకోసం…

 

అసలెవరూ ఒప్పుకోలేదు…

స్టోరీ విన్నప్పుడే సినిమా కంపల్సరీగా ఆడుతుంది అనే కాన్ఫిడెన్స్ ఉన్నా, హీరోయిన్ క్యారెక్టర్ చేయడానికి అసలెవరూ డేర్ చేయలేదు. చివరికి పూజ రామ చంద్రన్ ఓకె అనడంతో సినిమా బిగిన్ అయింది. అసలు తను కంప్లీట్ గా క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అయి పర్ఫామ్ చేశారు.

 

అందుకే లేటైంది 

సినిమా షూటింగ్ జస్ట్ 25 రోజుల్లో కంప్లీట్ అయిపోయింది. ప్రొడ్యూసర్స్ కొత్తవాళ్ళు కావడంతో రిలీజ్ కి ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఈ లోపు D.V. క్రియేషన్స్ వెంకటేష్ గారు అవుట్ పుట్ చూసి, సినిమా సక్సెస్ గ్యారంటీ అని కాన్ఫిడెంట్ తో సినిమా రిలీజ్ రెస్పాన్సిబిలిటీ దగ్గరి నుండి ప్రతీది ఆయనే చూసుకుంటున్నారు.

 

డిఫెరెంట్ గా చేద్దామనుకున్నాం.

రెగ్యులర్ సినిమాలా 4 పాటలు 2 ఫైట్స్ కాకుండా డిఫెరెంట్ సినిమా చేయాలనుకున్నాం. ఈ సినిమా బిగిన్ చేసినప్పుడు కూడా భయం భయం గానే చేశాం, వర్కవుట్ అవుతుందా లేదా…? కానీ అవుట్ పుట్ చూశాక చాలా కాన్ఫిడెంట్ గా ఉంది.

 

డిఫెరెంట్ క్యారెక్టరైజేషన్స్.

దేవి – శ్రీ- ప్రసాద్ అనేవి మూడు డిఫెరెంట్ క్యారెక్టరైజేషన్స్. ఈ సినిమాలో దేవి అనే క్యారెక్టర్ నెగటివ్. ఇక శ్రీ రోల్ ధనరాజ్ ప్లే చేశాడు. ఈ క్యారెక్టర్ ఎలా అంటే ఎవరి మాట స్ట్రైకింగ్ గా ఉంటే ఆ మాటకి ప్రిఫరెన్స్ ఇచ్చేస్తాడు. ఇక ప్రసాద్ క్యారెక్టర్ నేను ప్లే చేశాను. ఈ క్యారెక్టర్ కంప్లీట్ పాజిటివ్ గా ఉంటుంది.

 

క్యారెక్టరైజేషన్ బేస్డ్ స్టోరీ.

ఒక ముగ్గురు డిఫెరెంట్ డిఫెరెంట్ ఆలోచనలతో ఉన్న వాళ్ళు ఒక రేర్ ఇన్సిడెంట్ ఫేస్ చేసినప్పుడు ఎలా రియాక్టవుతారు… ముగ్గురూ కలిసి సిచ్యువేషన్ ని ఎలా ఫేస్ చేసారు అనేదే ఈ సినిమా….

 

నెక్స్ట్ సినిమాలు అవే…

‘మనసైనోడు’ సినిమా రిలీజ్ కి రెడీగా అవుతుంది. ప్రొడ్యూసర్స్ మ్యాగ్జిమం నవంబర్ లో రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు. వీర భోగ వసంత రాయలు సినిమాలో కూడా నటిస్తున్నాను. ఈ సినిమా ఇంకో 30% షూటింగ్ జరగాల్సి ఉంది.