‘మన్మధుడు 2’ లో కూడా అంతేనేమో...
Saturday,June 08,2019 - 02:03 by Z_CLU
నాగార్జున ‘మన్మధుడు’ సినిమా గురించి డిస్కషన్ వస్తే ఫ్లాష్ బ్యాక్ సీక్వెన్సెస్ గురించి ఎవరూ మాట్లాడకుండా ఉండరు. మరీ ముఖ్యంగా ఆ సినిమాలో నాగ్, అంశుల మధ్య కెమిస్ట్రీ సినిమాకే హైలెట్ గా నిలిచింది. అయితే ఇప్పుడు ‘మన్మధుడు2’ లో కూడా అదే స్థాయి ఫ్లాష్ బ్యాక్ సీక్వెన్సెస్ ఉండబోతున్నాయనిపిస్తుంది.
రీసెంట్ గా ఈ సినిమాలో కీర్తి సురేష్ కూడా నటిస్తుందనే విషయం కన్ఫమ్ అవ్వగానే, న్యాచురల్ గానే ఈ సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగిపోయాయి. సినిమాలో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కాబట్టి మ్యాగ్జిమం కీర్తి సురేష్ రోల్ ఫ్లాష్ బ్యాక్ లోనే ఉండబోతుంది.

ఈ సినిమాలో రోజు రోజుకి పెరుగుతున్న హీరోయిన్స్ డీటేల్స్ తప్ప సినిమా కథకి సంబంధించి ప్రతీది సస్పెన్స్ లో ఉంచుతున్న మేకర్స్, సినిమా మాత్రం అవుట్ అండ్ అవుట్ అండ్ అవుట్ ఎమోషనల్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ అనే భరోసా అయితే ఇస్తున్నారు.
రాహుల్ రవీంద్రన్ రాసుకున్న కథపై నాగ్ మొదటి నుండే చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. అందుకే తన బ్లాక్ బస్టర్ టైటిల్ ని పెట్టుకున్నాడు. దీని బట్టి చూస్తే అందరూ గెస్ట్ చేస్తున్నట్టు ఫ్లాష్ బ్యాక్ సీక్వెన్సెస్ అద్భుతంగా ఉండటం గ్యారంటీ అనే అనిపిస్తుంది.