మన్మథుడు-2 ట్రయిలర్: అప్పుడు ప్రేమ.. ఇప్పుడు పెళ్లి

Thursday,July 25,2019 - 12:14 by Z_CLU

మన్మథుడు సినిమాలో అమ్మాయిల్ని అస్సలు ఇష్టపడడు అభిరామ్ (నాగార్జున). సినిమాలో దానికి ఓ రీజన్ ఉంటుంది. ఇప్పుడు మన్మథుడు-2 సినిమాలో పెళ్లి అనే పదార్థానికి దూరంగా ఉంటాడు శ్యామ్. దీనికి కూడా ఓ బలమైన రీజన్ ఉండే ఉంటుంది. నాగ్ హీరోగా నటించిన మన్మథుడు-2 ట్రయిలర్ కొద్దిసేపటి కిందట విడుదలైంది.

నాగార్జున క్యారెక్టర్ ఏంటనే విషయంపై ట్రయిలర్ లో ఓ ఐడియా ఇచ్చారు. ప్రేమకు ఓకే, పెళ్లి మాత్రం చేసుకోననే టైపు పాత్ర ఇది. అందుకు తగ్గట్టుగానే “నేను పిల్లల్ని కనను, నా జీవితమే నా బాధ్యత” అనే డైలాగ్ ను కూడా పెట్టారు. ఇలాంటి వ్యక్తిని పెళ్లాడ్డానికి రకుల్ ఎందుకు ఒప్పుకుంది? దీనివెనక ఉన్న కథేంటనేది మన్మథుడు-2 సినిమా.

ట్రయిలర్ చూసిన తర్వాత వెన్నెల కిషోర్ కు మరోసారి మంచి క్యారెక్టర్ దొరికిందనే విషయం అర్థమౌతూనే ఉంది. దాదాపు సినిమా మొత్తం వెన్నెల కిషోర్, నాగార్జున పక్కన కనిపించబోతున్నాడు. ఇక ట్రయిలర్ లో పాత్రలన్నింటినీ పరిచయం చేశారు. రకుల్ క్యారెక్టర్ పై మాత్రం చిన్నపాటి సస్పెన్స్ ఉంచారు.

రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు చైతన్ భరధ్వాజ్ సంగీతం అందించగా, ఎమ్.సుకుమార్ సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేశాడు. ఆగస్ట్ 9న వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతోంది మన్మథుడు-2 సినిమా.