ఎవర్ గ్రీన్ గ్రీకువీరుడు.. మన్మథుడు-2 టీజర్ రివ్యూ

Thursday,June 13,2019 - 02:02 by Z_CLU

మరోసారి మన్మథుడు అనిపించుకున్నాడు. గ్రీకువీరుడు అనే పదానికి బ్రాండ్ అంబాసిడర్ లా ఉన్నాడు నాగ్. మన్మథుడు-2 మూవీ టీజర్ లాంచ్ అయింది. నాగ్ లోని రొమాంటిక్ యాంగిల్ ను పీక్స్ లో చూపించింది.

ట్రెండ్ కు తగ్గట్టు నాగార్జున ఎలా అప్ డేట్ అవుతున్నాడో తెలుసుకోవాలంటే మన్మథుడు-2 టీజర్ చూస్తే సరిపోతుంది. నాగ్ యాక్టింగ్, డ్రెస్సింగ్, మేనరిజమ్స్ ఇప్పటి జనరేషన్ కు కూడా కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి. స్వయంగా హీరోపైనే పంచ్ లు పేలడం ఈ టీజర్ స్పెషాలిటీ.

పైకి శ్రీరాముడిలా కనిపించిన నాగార్జున, తెరవెనక మాత్రం శ్రీకృష్ణుడు చేసే పనులన్నీ చేస్తుంటాడు. మన్మథుడు సినిమాకు ఈ మన్మథుడు-2కు ఎలాంటి సంబంధం లేకపోయినా ఈ సినిమాకు కూడా మన్మథుడు అనే టైటిల్ కరెక్ట్ అనిపించేలా ఉంది టీజర్. పైగా టైటిల్ లోగో డిజైన్ కూడా మన్మథుడు సినిమానే గుర్తుచేస్తుంది.

ఓవరాల్ గా మన్మథుడు-2 టీజర్ ఎంత ట్రెండీగా ఉందో, అంతే హిలేరియస్ గా ఉంది. చిలసౌ తర్వాత దర్శకుడు రాహుల్ రవీంద్రన్ మరోసారి తన కామెడీ యాంగిల్ ను చూపించినట్టున్నాడు. ఆగస్ట్ 9న ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేయడానికి థియేటర్లలోకి వస్తున్నాడు మన్మథుడు అలియాస్ గ్రీకువీరుడు.