మన్మథుడు-2 ఫస్ట్ వీకెండ్ కలెక్షన్

Monday,August 12,2019 - 01:25 by Z_CLU

నాగ్, రకుల్ హీరోహీరోయిన్లుగా నటించిన మన్మథుడు-2 సినిమా ఫస్ట్ వీకెండ్ కంప్లీట్ చేసుకుంది. విడుదలైన ఈ 3 రోజుల్లో సినిమాకు వరల్డ్ వైడ్ 8 కోట్ల రూపాయల షేర్ వచ్చింది. రాహుల్ రవీంద్రన్ డైరక్ట్ చేసిన ఈ సినిమా మెల్లమెల్లగా ఫ్యామిలీ ఆడియన్స్ కు రీచ్ అవుతుందంటున్నాడు నాగ్. ఫ్యామిలీ ఆడియన్స్ కు సినిమా కంటెంట్ కనెక్ట్ అవ్వడానికి కాస్త టైమ్ పడుతుందని, వెయిట్ చేయాలని అంటున్నాడు.

మిక్స్ డ్ టాక్ కారణంగా అటు వసూళ్లు మాత్రం పడిపోతున్నాయి. మొదటి రోజు వరల్డ్ వైడ్ 4.85 కోట్లు వస్తే.. రెండో రోజు అది రూ.1.75 కోట్లకు, మూడో రోజు రూ.1.45 కోట్ల రూపాయలకు పడిపోయింది. అలా 3 రోజుల్లో ఈ సినిమా 8 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది. ఇవాళ్టి నుంచి ఈ సినిమా ఎలా పెర్ఫార్మ్ చేస్తుందనే క్యూరియాసిటీ అందర్లో ఉంది.

ఏపీ, నైజాం 3 రోజుల షేర్
నైజాం – రూ. 2.10 కోట్లు
సీడెడ్ – రూ. 0.81 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 0.84 కోట్లు
ఈస్ట్ – రూ. 0.41 కోట్లు
వెస్ట్ – రూ. 0.43 కోట్లు
గుంటూరు – రూ. 0.80 కోట్లు
కృష్ణా – రూ. 0.52 కోట్లు
నెల్లూరు – రూ. 0.25 కోట్లు