మన్మథుడు-2 ఫస్ట్ డే కలెక్షన్

Saturday,August 10,2019 - 02:43 by Z_CLU

నాగార్జున, రకుల్ హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా మన్మథుడు-2. రాహుల్ రవీంద్రన్ డైరక్ట్ చేసిన ఈ సినిమాకు మొదటి రోజు మిక్స్ డ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ సినిమాపై ఉన్న హైప్ కారణంగా తొలి రోజు మన్మథుడు మంచి వసూళ్లు సాధించాడు. మొదటి రోజు ఈ సినిమాకు వరల్డ్ వైడ్ 4 కోట్ల 50 లక్షల రూపాయల షేర్ వచ్చింది.

తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు చెప్పుకోదగ్గ రేంజ్ లో వసూళ్లు వచ్చాయి. ఏపీ, నైజాం కలిపి 3 కోట్ల 80 లక్షల రూపాయల షేర్ సాధించింది మన్మథుడు-2. ఆల్రెడీ అడ్వాన్స్ బుకింగ్ జోరుగా సాగడంతో, ఈరోజు రేపు ఈ సినిమాకు మంచి కలెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. సోమవారం నుంచి మన్మథుడుకి అసలైన పరీక్ష ఎదురుకానుంది.

ఏపీ, నైజాం మొదటి రోజు షేర్
నైజాం – రూ. 1.30 కోట్లు
సీడెడ్ – రూ. 0.48 కోట్లు
ఉత్తరాంధ్ర -రూ. 0.46 కోట్లు
ఈస్ట్ -రూ. 0.35 కోట్లు
వెస్ట్ – రూ. 0.28 కోట్లు
గుంటూరు – రూ. 0.54 కోట్లు
కృష్ణా – రూ. 0.28 కోట్లు
నెల్లూరు – రూ. 0.18 కోట్లు