మంజుల దర్శకత్వంలో సినిమా ప్రారంభం...

Wednesday,May 10,2017 - 12:50 by Z_CLU

సూపర్ స్టార్ మహేష్ ఫామిలీ నుంచి మరో డైరెక్టర్ ఎంట్రీ ఇచ్చేసింది. ఇప్పటికే ఘట్టమనేని ఫామిలీలో సూపర్ స్టార్ కృష్ణ 17 సినిమాలకు దర్శకత్వం వహించగా, విజయ్ నిర్మల దర్శకురాలిగా గిన్నిస్ బుక్ రికార్డ్ అందుకున్న సంగతి తెలిసిందే. లేటెస్ట్ గా ఈ ఫామిలీ డైరెక్టర్ లిస్ట్ లోకి చేరింది మహేష్ అక్క మంజుల..


అప్పట్లో నటిగా పలు సినిమాల్లో నటించి ఆకట్టుకున్న మంజుల ప్రెజెంట్ మెగా ఫోన్ పట్టడానికి రెడీ అయింది. సందీప్ కిషన్-అమీరా దస్తూర్ జంటగా ఆనంది ఇందిరా ప్రొడక్షన్ నిర్మాణం లో మంజుల దర్శకత్వంలో  తెరకెక్కనున్న ఈ సినిమా ఇటీవలే పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.

ఈ సందర్భంగా మంజుల మాట్లాడుతూ ” ఎప్పటి నుంచి డైరెక్టర్ అవ్వాలనుకున్నా కానీ ఆర్టిస్ట్ గా డైవర్ట్ అవ్వడం కాస్త లేట్ అయింది. ఇది నాకు చాలా స్పెషల్ మూవీ కారణం ఇది నా దర్శకత్వంలో తెరకెక్కనున్న మొదటి సినిమా. ఫన్ బ్యూటిఫుల్ కమర్షియల్ లవ్ స్టోరీ గా రూపొందనున్న ఈ సినిమా కచ్చితంగా అందరిని టచ్ చేసి ఫుల్ గా ఎంటర్టైన్ చేస్తుందని నమ్ముతున్నాను.. ఈ సినిమాలో నా కూతురు ఒక చైల్డ్ ఆర్టిస్ట్ గా కనిపించబోతుంది.. డైరెక్టర్ గా నాకు ఆర్టిస్ట్ గా దానికి ఇదే మొదటి సినిమా. మే 20 నుంచి షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నాం.” అన్నారు..