రామ్ ‘ఇస్మార్ట్ శంకర్’ మ్యూజిక్ డైరెక్టర్ ఫిక్స్

Friday,January 04,2019 - 02:36 by Z_CLU

ఎక్స్ పెక్టేషన్స్ ని సెట్ చేసింది నిన్న రిలీజైన రామ్ ‘ఇస్మార్ట్ శంకర్’ ఫస్ట్ లుక్ పోస్టర్. అయితే ఈ సినిమా నుండి వచ్చిన మరో లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే, ఈ సినిమాకి మణిశర్మ మ్యూజిక్ కంపోజ్ చేయనున్నాడు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ లాక్ చేసుకున్న పూరి, మణిశర్మ తో ఆల్రెడీ మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా బిగిన్ చేశాడని తెలుస్తుంది.  అయితే ఇక తెలియాల్సింది ఈ సినిమాలో హీరోయిన్ సంగతే.

‘పోకిరి’, ‘ఏక్ నిరంజన్’, ‘చిరుత’, ‘కెమెరా మెన్ గంగతో రాంబాబు’ తరవాత పూరి, మణిశర్మ ల కాంబోలో వస్తున్న సినిమా ఇది. అందుకే ఫ్యాన్స్ లో ఈ సినిమా సాంగ్స్ పై కూడా మరిన్ని అంచనాలు క్రియేట్ అవుతున్నాయి. ఓవరాల్ గా ఫ్యాన్స్ లో ‘ఇస్మార్ట్ శంకర్’ చుట్టూ క్రియేట్ అవుతున్న వైబ్స్ చూస్తుంటే, పూరి ఈసారి తన మార్క్ ని స్ట్రేట్ గా ఫిక్స్ చేస్తాడనిపిస్తుంది.  

మ్యాగ్జిమం జనవరి లాస్ట్ వీక్ కల్లా ఈ సినిమా సెట్స్ పైకి వచ్చేస్తుంది. లావణ్య సమర్పణలో పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ బ్యానర్లపై తెరకెక్కుతున్న ఈ సినిమాకి పూరి జగన్నాథ్, చార్మి ప్రొడ్యూసర్స్. ఈ సినిమాని ‘మే’ లో రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు మేకర్స్.