మణి ఈజ్ బ్యాక్.. మరో బంపర్ ఆఫర్

Thursday,November 21,2019 - 03:10 by Z_CLU

ఒక్క సినిమా.. ఒకే ఒక్క సినిమా మెలొడీ బ్రహ్మను మళ్లీ ట్రాక్ పైకి తీసుకొచ్చింది. అదే ఇస్మార్ట్ శంకర్ సినిమా. ఈ సినిమాతో మరోసారి మేకర్స్ అంతా మణి ముందు క్యూ కట్టారు. ఫ్యాన్సీ ఆఫర్లు అందిస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే చిరంజీవి-కొరటాల సినిమాకు సంగీతం అందించే అవకాశం అందుకున్న మణిశర్మ.. ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్ట్ ను కూడా దక్కించుకున్నాడు.

త్వరలోనే అసురన్ సినిమాను రీమేక్ చేయబోతున్నాడు వెంకటేశ్. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాకు సంగీతం అందించే అవకాశం మణిశర్మకు వచ్చింది. త్వరలోనే దీనికి సంబంధించి అఫీషియల్ స్టేట్ మెంట్ రాబోతోంది.

ప్రస్తుతం ఈ మ్యూజిక్ డైరక్టర్, తన ఫోకస్ మొత్తాన్ని ఫైటర్ సినిమాపై పెట్టాడు. పూరి జగన్నాధ్, విజయ్ దేవరకొండ కాంబోలో రాబోతున్న ఈ సినిమాకు ఇవాళ్టి నుంచి మ్యూజిక్ సిట్టింగ్స్ స్టార్ట్ చేశాడు మణిశర్మ. సో.. మణి ఈజ్ బ్యాక్ అన్నమాట.