అందులో నా ప్రమేయం లేదు - మణిశర్మ

Tuesday,January 19,2021 - 06:08 by Z_CLU

ఎన్నో సూపర్ డూపర్ హిట్ సాంగ్స్ అందించి మెలోడీ బ్రహ్మగా పేరుతెచ్చుకున్న  మణిశర్మ ఇటివలే ‘నారప్ప’ సినిమా కోసం మరో సంగీత దర్శకుడు మ్యూజిక్ చేసిన స్కోర్ ని కాపీ కొట్టారని సోషల్ మీడియాలో ట్రోల్ జరిగింది. వెంకటేష్ పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ చేసిన ‘గ్లిమ్ప్స్ ఆఫ్ నారప్ప’ టీజర్ లో స్కోర్ విని ఒరిజినల్ సినిమా నుండి మణిశర్మ కాపీ కొట్టారని ట్రోల్ చేసారు నెటిజర్లు.

ఆ విషయంపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ క్లారిటీ ఇచ్చారు మణిశర్మ. ‘నారప్ప’ సినిమాకు తనను పని చేయనిస్తే బాగుంటుందని అలా చేయనివ్వడం లేదని, టీజర్ కి తను మ్యూజిక్ ఇవ్వలేదని , ఒరిజినల్ సినిమాలోని స్కోర్ నే వాడుకున్నారని,  తన ప్రమేయం లేకుండానే కొన్ని జరుగుతున్నాయని  చెప్పుకున్నాడు. అంతే కాదు ఆ విషయం పెద్ద కాంట్రవర్సీ అయ్యిందని తెలియజేసాడు. మణిశర్మ ఇచ్చిన ఈ క్లారిటీతో మేకర్స్ టీజర్ కోసం ఒరిజినల్ స్కోర్ నే వాడారని అందరికీ తెలిసొచ్చింది.