నాగ్-నాని సినిమా కోసం మెలొడీ బ్రహ్మ

Monday,February 05,2018 - 12:29 by Z_CLU

నాగార్జున, నాని కలిసి ఓ మల్టీస్టారర్ సినిమా చేయబోతున్నారనే విషయం తెలిసిందే. ఈ నెల 24న ఈ సినిమాను ప్రారంభించబోతున్నారు. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా మ్యూజిక్ డైరక్టర్ గా మణిశర్మను తీసుకున్నారు. మెలొడీ బ్రహ్మ రాకతో ఈ మల్టీస్టారర్ కు మరింత వెయిట్ పెరిగింది. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వనీదత్ ఈ సినిమాను నిర్మించబోతున్నారు.

ఈ సినిమాకు సంబంధించి దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య ఇప్పటికే స్క్రీన్ ప్లే పూర్తిచేశాడు. త్వరలోనే మణిశర్మ కలిసి మ్యూజిక్ సిట్టింగ్స్ లో పాల్గొంటాడు. సెట్స్ పైకి వెళ్లకముందే కనీసం 2 పాటలు ఫైనల్ చేయాలనేది టార్గెట్.

ప్రస్తుతం వర్మ సినిమాతో నాగార్జున బిజీగా ఉన్నాడు. అటు నాని కూడా కృష్ణార్జున యుద్ధం సినిమాకు సంబంధించి ఫైనల్ షెడ్యూల్ లో పాల్గొంటున్నాడు. ఈ రెండు సినిమాలు ఓ కొలిక్కి వచ్చిన వెంటనే ఈ మల్టీస్టారర్ మూవీ సెట్స్ పైకి వస్తుంది.