మణిశర్మ ఒక్కడే ...

Tuesday,December 03,2019 - 11:02 by Z_CLU

టాలీవుడ్ లో యంగ్ మ్యూజిక్ డైరెక్టర్స్ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు. పైకి కాంపిటీషన్ ఉందని బయట పడకపోయినా, కంపోజ్ చేసే ప్రతి సాంగ్ మినిమం స్టాండర్డ్స్ ఉండేలా చూసుకుంటున్నారు. వీటి మధ్య సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్స్ న్యాచురల్ గానే వెనకబడుతున్నారు. అయితే వీరి మధ్య మణిశర్మ ఒక్కడే ఈ యంగ్ కంపోజర్స్ కి ధీటుగా నిలబడుతున్నాడు.

రీసెంట్ గా ‘ఇస్మార్ట్ శంకర్’ గ్రాండ్ సక్సెస్ అవ్వడం న్యాచురల్ గానే మణిశర్మని మళ్ళీ ఫామ్ లోకి తీసుకు వచ్చేసింది. దానికి తోడు చిరంజీవి 152 కి మణిశర్మ ఫిక్సవ్వడం… ఈ మెలోడీ బ్రహ్మని టాప్ రేంజ్ కి తీసుకువెళ్ళింది.

మొన్నా మధ్య మణిశర్మ ని BGM కే పరిమితం చేసిన మేకర్స్ ఇప్పుడు సాంగ్స్ కి కూడా మణిశర్మ మ్యూజికల్ మ్యాజిక్ నే ప్రిఫర్ చేస్తున్నారు. అందుకే రామ్ కూడా ‘ఇస్మార్ట్ శంకర్’ తరవాత చేస్తున్న ‘RED’ కి కూడా మణిశర్మనే ప్రిఫర్ చేశాడు. దీంతో పాటు వెంకీ ‘అసురన్’ రీమేక్ కి కూడా మణిశర్మ నే డైరెక్టర్.

ఈ లెక్కన సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్స్ లో ఈ స్థాయిలో బిజీగా ఉన్నది మణిశర్మ ఒక్కడే. ఇంకా అఫీషియల్ గా  అనౌన్స్ కాలేదు కానీ మణిశర్మ బ్యాగ్ లో మరిన్ని సినిమాలు చేరనున్నాయని సమాచారం.